News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

FOLLOW US: 
Share:

తెలంగాణలో పింఛను అందుకుంటున్న దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆస‌రా పెన్ష‌న్ల కింద నెలానెలా వారు అందుకుంటున్న మొత్తాన్ని పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. పెంచిన పెన్ష‌న్లు వ‌చ్చే నెల నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కేసీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

మొత్తం తెలంగాణ స‌మాజం బాగుండాలని, అందుకు కులం, మతం తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ముస‌ల‌మ్మ‌లు, ముస‌లి తాత‌లు ఆస‌రా పెన్ష‌న్ల‌తో బ్ర‌హ్మాండంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం విక‌లాంగుల‌కు రూ.3,116 పెన్ష‌న్ ఇస్తున్నామని చెప్పారు. ఈ తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుగుతున్న ఈ సంద‌ర్భంలో, ఈ రోజు మంచి రోజు కాబట్టి విక‌లాంగుల పెన్ష‌న్ కూడా పెంచ‌బోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.3,116 పింఛను వస్తుండగా, మ‌రో వెయ్యి రూపాయలు పెంచి రూ.4,116 ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల గ‌డ్డ పై ఉండి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రక‌టించాల‌ని తాను ఇన్ని రోజులు ఈ విషయాన్ని స‌స్పెన్షన్‌లో పెట్టానని అన్నారు. దీంతో ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పెన్ష‌న్ అందనుంది.

‘‘మంచిర్యాల జిల్లా కావాలనేది ప్రజల చిరకాల కాంక్ష. ఎన్నో పోరాటాలు చేశారు. గత ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక జిల్లా చేసుకున్నాం’’

సింగరేణికి గుడ్ న్యూస్
సింగరేణి సంస్థని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ చేసిన అప్పులు తీర్చలేకే సింగరేణిలో 49 శాతాన్ని కేంద్రానికి అప్పగించిందని అన్నారు. 2014 కంటే ముందు సింగరేణి కార్మికుల‌కు ఇచ్చే బోన‌స్ 18 శాతం మాత్రమే ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. అంటే కేవ‌లం రూ.50 నుంచి 60 కోట్లు మాత్ర‌మే కార్మికుల‌కు పంచేదని అన్నారు. తెలంగాణ వ‌చ్చాక 2014లో సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్ రూ.11 వేల కోట్లు మాత్ర‌మే అని.. ఇవాళ అదే సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్‌ను రూ.33 వేల కోట్ల‌కు పెంచుకున్నామని అన్నారు. అదే విధంగా సింగ‌రేణి లాభాలు కేవ‌లం రూ.300 నుంచి రూ.400 కోట్లు మాత్ర‌మే ఉంటే.. ఇవాళ సింగ‌రేణిలో ఈ ఏడాది వ‌చ్చిన లాభాలు రూ. 2,184 కోట్లకు పైనే అని అన్నారు.

వచ్చే దసరాకు రూ.700 కోట్ల బోనస్
ఈ లాభాల వల్ల వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు పంచ‌బోయే బోన‌స్ రూ.700 కోట్లుగా ఉంటుందని చెప్పారు. దీంతో జనం ఒక్కసారిగా ఈలలు, అరుపులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. 

సింగరేణి విషయంలో కీలక విధానం - కేసీఆర్

‘‘మన దేశంలో బొగ్గుకు కొరత లేదు. సింగరేణితో పాటు, ఈస్టర్న్ కోల్స్, వెస్టర్న్ కోల్ మైన్స్ ఉండగా అన్నీ ప్రైవేటు పరం చేస్తామని చెప్తున్నారు. మన దేశంలో బొగ్గు కొరత లేనే లేదు. దిక్కుమాలిన పాలసీలతో కేంద్ర ప్రభుత్వం మొత్తం అమ్మేస్తుంది. సింగరేణి ఎండీని నేను ఇండోనేసియా, ఆస్ట్రేలియా కూడా పంపా. ఖమ్మం జిల్లాలో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. వజ్రపు తునక లాంటి సింగరేణికి మైనింగ్ అనుభవం ఉంది. మిగతా గనుల తవ్వకాలు ఎక్కడ ఉన్నా సింగరేణికే అప్పగించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఇంత బొగ్గు ఉన్నా దాన్ని వాడకుండా ఆస్ట్రేలియా, ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోనే అన్యాయం జరుగుతోంది కాబట్టి, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పోరాటానికి నడుం బిగించాం. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ సగం ముంచితే, బీజేపీ మిగతా సగం ముంచుతామని చెబుతోంది.

Published at : 09 Jun 2023 08:46 PM (IST) Tags: Good News Asara pensions CM KCR differently abled persons Telangana pensions

ఇవి కూడా చూడండి

Seasonal Diseases: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి, మంత్రి మంత్రి హరీష్ రావు వెల్లడి

Seasonal Diseases: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి, మంత్రి మంత్రి హరీష్ రావు వెల్లడి

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

Hyderabad: గణేష్ నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Hyderabad: గణేష్ నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Telangana Cabinet: ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ, ఇదే చివరి సమావేశమా?

Telangana Cabinet: ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ, ఇదే చివరి సమావేశమా?

Minister Sabitha Indra Reddy: తెలంగాణలో ఆ స్టూడెంట్స్‌కి వచ్చే 24 నుంచి ఫ్రీ టిఫిన్ - మంత్రి సబిత సమీక్ష

Minister Sabitha Indra Reddy: తెలంగాణలో ఆ స్టూడెంట్స్‌కి వచ్చే 24 నుంచి ఫ్రీ టిఫిన్ - మంత్రి సబిత సమీక్ష

టాప్ స్టోరీస్

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?