Jagitial News: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస - కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, ఎక్కడంటే?
Telangana News: జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Clash Between Congress And bjp Leaders in Jagitial: జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం రసాభాసగా మారింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలో సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగి తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కు తగ్గకపోవడంతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పడంతో శాంతించారు.