అన్వేషించండి

Cheyutha Pension Scheme: జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా

Cheyutha Pension Scheme: తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి కొత్తగా రెండు లక్షల చేయూత పెన్షన్లు పంపిణీ చేయనుంది. చేయూత స్కీమ్ అర్హతలు, దరఖాస్తు ప్రక్రియను తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకంతో కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్.
  • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం.
  • 57 ఏళ్లు పైబడినవారితో పాటు చేనేత, గీత కార్మికులకు కూడా వర్తింపు.
  • ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు; జూన్ 2 నుంచి పంపిణీ.

Cheyutha Pension Scheme: తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 'చేయూత' పెన్షన్ పథకం ద్వారా కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయనుంది. సమాజంలోని అణగారిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పథకం అండగా నిలుస్తుంది. అర్హులైన వారు ఎలాంటి ఆలస్యం లేకుండా డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, ముందుగానే దరఖాస్తు చేసుకుంటే సకాలంలో పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు పెన్షన్లు ఇస్తున్నారు.  

ఎవరు అర్హులు?

57 ఏళ్ల వయసు పైబడిన వారికే కాకుండా, చేనేత కార్మికులు, గీత కార్మికులకు కూడా చేయూత పథకం వర్తిస్తుంది. తక్కువ వార్షిక ఆదాయం, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పింఛన్ అందిస్తున్నారు. ఈ పథకంతో పాటు, అర్హత గల పేద కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.  

Aslo Read: రూ.50 లక్షల లోన్, రూ.17 లక్షల సబ్సిడీ.. PMEGP Scheme అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇలా

 చేయూత పెన్షన్ స్కీమ్ అర్హతలు 

చేయూత పథకం కింద నెలవారీ పెన్షన్ పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ నిబంధనలు పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణాల్లో ఉండే వారికి రూ. 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, డిజెబిలిటీ సర్టిఫికెట్(వికలాంగులు), డెత్ సర్టిఫికెట్(వితంతువులు), వైద్య ధ్రువపత్రాలు (వ్యాధిగ్రస్తులు) ఉండాలి. పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ అయి ఉండాలి. 

Aslo Read: గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్‌కు టెస్లా రాక ఖరారు!

దరఖాస్తు ప్రక్రియ 

చేయూత పథకానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ, మీసేవ కేంద్రాల్లో అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. 'ప్రజా పాలన' వేదిక ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత  ఫీల్డ్ ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి వివరాలను పరిశీలిస్తారు. మీ జీవన ప్రమాణాలు, ఆదాయ వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారు. వయసుకు సంబంధించిన పత్రాలు తప్పులున్నా.. సమాచారం సరిపోకపోయినా మీ అప్లికేషన్ ను రిజెక్ట్ చేస్తారు. అర్హులై ఉండి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే, జిల్లా కలెక్టరేట్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. అందుకే డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది.  జూన్ 2న అధికారికంగా ఈ కార్యక్రమం స్వీకరించనున్నారు.  మరిన్ని వివరాల కోసం cheyutha.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Aslo Read: యాదాద్రిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల, పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Frequently Asked Questions

చేయూత పెన్షన్ పథకం కింద ఎంతమందికి కొత్తగా పెన్షన్లు అందనున్నాయి?

తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకం ద్వారా జూన్ 2 నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనుంది.

చేయూత పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు?

57 ఏళ్లు పైబడిన వారు, చేనేత, గీత కార్మికులు, తక్కువ ఆదాయం, తెల్ల రేషన్ కార్డు కలిగిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు అర్హులు.

చేయూత పెన్షన్ పొందడానికి ఆదాయ పరిమితి ఎంత?

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు లోపు ఉండాలి.

చేయూత పెన్షన్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో గ్రామ పంచాయతీ, మీసేవ కేంద్రాల్లో లేదా 'ప్రజా పాలన' వేదిక ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget