అన్వేషించండి

Cheating Case Against KA Paul : ఎమ్మెల్యే టిక్కెట్ పేరుతో రూ. 50లక్షల మోసం - కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

Telangana News : హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదయింది.అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

Case On KA Paul :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై పంజాగుట్టలో చీటింగ్ కేసు నమోదయింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ టిక్కెట్ ఇస్తామని చెప్పి రూ. యాభై లక్షలు తీసుకున్నారని కానీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. రూ. 30 లక్షలు ఆన్ లైన్‌లో.. రూ. 20 లక్షలు నగదు ద్వారా చెల్లించానని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది నవంబర్‌లోనే ముగిశాయి. ఆ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు. ఆయన  పార్టీ ఇన్  యాక్టివ్ గా మారడంతో.. ఈసీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కామన్ సింబల్ ఇవ్వాలంటూ కేఏ పాల్  రచ్చ చేశారు. అయితే చివరికి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టలేదు. ఇటీవలి ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబూమోహన్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించినప్పటికీ.. చివరికి బాబూమోహన్ కూడా.. హ్యాండిచ్చారు.                                        

కేఏ పాల్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల కోసం వెదుక్కుంటూ ఉంటారు. ఆయన పార్టీకి డబ్బులు ఇచ్చి మరీ టిక్కెట్ తీసుకునే వాళ్లు ఉంటారా అని ఈ కేసు గురించి తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. అది కూడా యాభై లక్షల మొత్తం కావడంతో పోలీసులు కూడా పాల్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఇంత మొత్తం ఇస్తారా అని ఆరా తీస్తున్నారు. కేఏ పాల్ స్వయంగా పోటీ చేసినా రెండు, మూడు వేల ఓట్లు రావడం కష్టం. మునుగోడులో కేఏ పాల్ పోటీ చేస్తే మూడు వేల ఓట్లు వచ్చాయి. ఆయన పార్టీ తరపున నిలబెట్టడానికి అభ్యర్థులు కూడా లేరు.                          

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోయారు. ఏపీలో కూడా తాను ఒక్కరే నిలబడ్డారు. పలువురుకి బీఫాంలు ఇచ్చినప్పటికీ వారెవరో ఎవరికీ తెలియదు. కనీసం ప్రచారం చేసే వారు కూడా లేరు.  కేఏ పాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. తనకు పది లక్షల ఓట్లు పడ్డాయని తానే గెలవబోతున్నట్టు పాల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాను గెలవబోతున్నట్టు ఇంటెలిజెన్సీ వాళ్లు కూడా తనతో చెప్పారని ఆయన అంటున్నారు. 

కేఏ పాల్ పై కేసు వెనుక దురుద్దేశం ఉందని.. ఆయన పార్టీ టిక్కెట్లకు డబ్బులు ఇచ్చే వారు ఉండరని .. పాల్ సానుభూతి పరులు చెబుతున్నారు. ఈ కేసుపై ప్రస్తుతం విశాఖలో ఉన్న కేఏ పాల్ స్పందించాల్సి ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget