News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CEO Vikas Raj: ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలి- తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ఆదేశం

CEO Vikas Raj: ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు

FOLLOW US: 
Share:

CEO Vikas Raj: రాబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రతి ఫిర్యాదును జిల్లాల ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. బహదూర్‌పురా, గోషామహల్‌, నాంపల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల్లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆగస్టు 27 ఆదివారం జరిగిన సమగ్ర సమీక్షా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈర్ఓలు, విచారణ అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలోనే సీఈఓ కొనసాగుతున్న రెండవ ఎస్ఎస్ఆర్ పురోగతిని సమీక్షించారు.

ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించాలి: వికాస్ రాజ్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో 18 నుంచి 19 ఏళ్ల వయసు గల వారి ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల సముదాయాన్న, పీడబ్ల్యూడీ ఓటర్లను, ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్ల నమోదు వందకు వంద శాతం అయ్యేలా చూడాలని కోరారు. ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వివిధ ప్రచార పద్ధతులను పాటించాలని డీఈఓలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలకు సీఈఓ వికాస్ రాజ్ సమగ్ర సూచనలను జారీ చేశారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరిచేందుకు మార్గాలు అన్వేషించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సీఈఓ కార్యాలయం, ఈసీ ద్వారా అందే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాస్తవ నివేదికలను ఆలస్యం చేయకుండా సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం  రెడీ అవుతోంది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.  ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించేందుకు రెడీ అవుతోంది. అక్టోబరు మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్... 2018లో ఏడాది ముందుగానే అసెంబ్లీను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.  2018 అక్టోబరు 6న షెడ్యూల్‌, డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు కూడా జనవరిలోనే ముగియనుంది. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం డిసెంబరు 17తో ముగియనుంది. 

Published at : 28 Aug 2023 09:34 AM (IST) Tags: Assembly Elections Telangana Assembly Elections Telangana News CEO Vikas Raj Poll Releated Complaints

ఇవి కూడా చూడండి

Telangana Elections: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల, మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?

Telangana Elections: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల, మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

DK Aruna: ప్రధానిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, నాలుక మడతపెట్టి కుట్టేస్తా : డీకే అరుణ వార్నింగ్

టాప్ స్టోరీస్

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ