Foreign Direct Investments: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - తెలుగు రాష్ట్రాల స్థానమిదే
FDI: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ 6, ఏపీ 11 స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీపీఐఐటీ వివరాలు వెల్లడించింది.
Foreign Direct Investment in AP and Telangana: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDIs) ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను కేంద్రం విడుదల చేసింది. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ 6, ఏపీ 11వ స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య తెలంగాణకు (Telangana) రూ.9,679 కోట్ల ఎఫ్ డీఐలు రాగా, ఏపీకి (AP) రూ.630 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) తాజాగా ఈ వివరాలు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్ నుంచి దేశంలోకి వస్తున్న ఎఫ్ డీఐలను రాష్ట్రాల వారీగా విభజించి చూపుతోంది. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,68,875.46 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు తొలి 5 స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో తొలి 5 రాష్ట్రాల వాటా రూ.1,44,544.11 కోట్ల (85.59%) మేర ఉంది. మొత్తం పెట్టుబడుల్లో తెలంగాణకు 5.73% వాటా దక్కగా, ఏపీకి 0.37% వాటా దక్కింది. కేంద్రం వాటాలను గుర్తించడం మొదలు పెట్టినప్పటి నుంచి అంటే 2019 అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు దాదాపు నాలుగేళ్లలో తెలంగాణకు రూ.45,445.14 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,679.25 కోట్లు వచ్చాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply
Also Read: Chandrababu News: ఏపీ లిక్కర్ కేసు: ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 27కి వాయిదా