అన్వేషించండి

KTR: రైతులకు కాంగ్రెస్ ఇంత మోసమా? రేవంత్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ - కేటీఆర్

Telangana News: కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టబోరని.. ఇక ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే అని కేటీఆర్ అన్నారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. అని దగా.. నయవంచన.. అని అన్నారు.

Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరి పంటకు రూ.500 బోనస్ ప్రకటించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు వరి పంట మొత్తానికి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు కేవలం సన్నాలకే దాన్ని పరిమితం చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నయవంచనకు గురి చేసిందని.. వారికి కౌంట్ డౌన్ రైతుల నుంచే మొదలవుతుందని అన్నారు.

‘‘గ్యారెంటీ కార్డులో “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా?? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా?? ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా అన్నారు.. ఇవ్వలేదు. 

వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే.. రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు. 

ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు.. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు.. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. ’’ అని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Embed widget