అన్వేషించండి

Manne Krishank : పోలీసుల అదుపులో మన్నె క్రిషాంక్ - తప్పుడు కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఆగ్రహం

BRS : ఓయూ హాస్టల్ మూసివేత పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana News :  బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నెక్రిషాంక్ ను   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడకు తరలించారో తెలియకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ , ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆయనను బషీర్ బాగ్‌లోని సైబర్ క్రైమ్ ఆఫీసుకు తరలించినట్లుగా తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొన్న తర్వాత క్రిషాంక్ హైదరాబాద్ వస్తున్న సమయంలో ఆయనను చౌటుప్పల్ వద్ద పోలీసులు ఆపారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకుని ఆయన కారులోనే నల్లగొండ వైపు తీసుకెళ్లారు.కానీ ఎంత సేపటికి నల్లగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తర్వాత నల్లగొండ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. అక్కడకూ ఆయనను తరలించలేదు. 

ఈ క్రమంలో పోలీసు అదుపులో ఉన్న క్రిషాంక్ ఆచూకీ తెలియకపోవడంతో  బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులను ఆయన సంప్రదించారు. చివరికి మన్నె క్రిషాంక్ ను బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు తరలించినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. 

 

మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా ఉన్నారు.  సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆయనపై ఆరు కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లను మూసివేయంపైనా ఫేక్ ట్వీట్  చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత కారణంగా హాస్టల్ విద్యార్ధులకు సెలవులు ప్రకటించారని ఆయన ఓ ట్వీట్ చేశారు. దాంతో  దుమారం రేగింది. వేసవి సెలవుల కారణంగా ఎప్పుడూ ఇచ్చే సెలవులే ఇచ్చామని ఓయూ తెలిపింది.                           

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఓయూ పోలీసులు మన్నె క్రిశాంక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశంపై కేసీఆర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తప్పుడు లెటర్లతో.. గోబెల్స్ మళ్లీ పుట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు  చేయడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగడానికి కారణం అయింది.                            

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget