అన్వేషించండి

BRS: ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్, ఎందుకంటే?

BRS: ఎన్నికల గుర్తు వివాదంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ECI కి నివేదించినా పట్టించుకోలేదంటూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

BRS: ఎన్నికల గుర్తు వివాదంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ పార్టీ బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికల గుర్తుల్లో కారును పోలిన వాటిని తొలగించాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు ఎన్నికల సంఘాన్ని కోరింది. వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని అభ్యర్థించింది. బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం మేరకు 2011లో రోడ్డు రోలర్‌ గుర్తును తొలగించింది. 

అయితే తాజాగా రోడ్డు రోలర్ గుర్తును తిరిగి ఓపెన్ గుర్తుల కేటగిరీలో ఎన్నికల సంఘం చేర్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్  పార్టీ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది.స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతి రోలర్‌, రోడ్‌రోలర్‌, సోప్‌డిష్‌, టెలివిజన్‌, కుట్టుమిషన్‌, ఓడ, ఆటోరిక్షా, ట్రక్‌ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇందుకు ఉదాహరణలను చూపించింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీచేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని బీఆర్ఎస్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, తద్వారా బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతుందని అభ్యర్థించింది. అయితే బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టనున్నది.

ఇదీ వివాదం
అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండే ఫ్రీ సింబల్స్ కేటాయింపుపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై బీఆర్ఎస్ ప్రతినిధులు భారత ఎన్నికల కమిషన్ (ECI)ని ఆశ్రయించారు. అటువంటి చిహ్నాలను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. కారును గుర్తులతో తమ పార్టీ అభ్యర్థులు నష్టపోతున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌, ఎంపీలు వెంకటేష్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఈసీని కలిసి విన్నవించారు. 

తెలంగాణలో యుగ తులసి పార్టీకి రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంపై బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కారు, రోడ్ రోలర్ గుర్తులు ఈవీఎంలలో ఒకే రకంగా కనిపిస్తాయని, గ్రామీణ నేపథ్యం ఉన్న వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి వివరించారు. రోడ్డు రోలర్‌తోపాటు చపాతీ మేకర్, సోప్ బాక్స్, ట్రాక్టర్, ఆటోరిక్షా, టీవీ, కుట్టుమిషన్, షిప్, డోలీ, కెమెరా గుర్తులు కూడా కారు గుర్తును పోలి ఉంటున్నాయని, ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకంటే ఎక్కువ ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయని కొన్ని ఉదాహరణలను ఉటంకించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కంప్లైంట్ చేసిన అంశాన్ని తాజాగా గుర్తుచేశారు. గతంలో తాము చేసిన ఫిర్యాదు మేరకు టోపీ, ఐరన్ బాక్స్ , ట్రక్, ఆటోరిక్షా గుర్తులను తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. రెండు వారాల వ్యవధిలో రోడ్డు రోలర్ గుర్తుపై తాము లేవనెత్తిన అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని తుది ఉత్తర్వులను ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget