అన్వేషించండి

BRS Party Incharges: అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలు నియామకం - 54 మందితో లిస్టు విడుదల చేసిన బీఆర్ఎస్

కొత్తగా నియమితులు అయిన వీరందరితో మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌రావు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలాఖరులో జరగనున్నందున బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ప్రచారం విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించింది. ప్రస్తుతానికి 54 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. కొత్తగా నియమితులు అయిన వీరందరితో మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌రావు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించారు. బీఆర్ఎస్ విజ‌యానికి అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌, వ్యూహాలపై కేటీఆర్, హ‌రీశ్‌రావు దిశానిర్దేశం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని అన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వానికి ప్రజ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని.. ప‌దేళ్ల అభివృద్ధిని ప్ర‌తి గ‌డ‌ప‌కు తీసుకెళ్లి ప్రజల్ని ఓట్లు అడ‌గాల‌ని సూచించారు. విప‌క్షాల‌కు ఎన్నిక‌లు కేవ‌లం హామీలు ఇచ్చే వేదిక‌లు మాత్రమే అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఫ‌లాలు అందుకున్న ప్ర‌తి ఒక్క‌రి ఇంటికి వెళ్లాలని, వారితో మ‌మేకం కావాల‌ని ఆదేశించారు.

పార్టీ శ్రేణుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించి, బీఆర్ఎస్ గెలుపున‌కు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. గ‌తం కంటే అత్య‌ధిక స్థానాల‌ను గెలిచేందుకు కృషి చేయాల‌న్నారు.

54 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలు వీళ్లే..
బోధ‌న్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌
నిజామాబాద్ అర్బ‌న్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌
గ‌జ్వేల్ – మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి
మ‌ల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ముదోల్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్
ఉప్ప‌ల్ – చైర్మ‌న్ రావుల శ్రీధ‌ర్ రెడ్డి
ఇబ్ర‌హీంప‌ట్నం – మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి
బెల్లంప‌ల్లి – ఎంపీ వెంక‌టేశ్ నేత‌
జ‌గిత్యాల – ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్
రామ‌గుండం – మాజీ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌
మంథ‌ని – ఈద శంక‌ర్ రెడ్డి
పెద్ద‌ప‌ల్లి – చైర్మ‌న్ ర‌వీంద‌ర్ సింగ్
మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్ర‌సాద్
చొప్ప‌దండి – మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్
న‌ర్సాపూర్ – ఎమ్మెల్సీ వెంక‌ట‌రాం రెడ్డి
జ‌హీరాబాద్ – మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్ర‌సాద్
సంగారెడ్డి – చైర్మ‌న్ వీ భూపాల్ రెడ్డి, చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్
దుబ్బాక – చైర్మ‌న్ బాల‌మ‌ల్లు
వేముల‌వాడ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
మాన‌కొండూరు – సుడా చైర్మ‌న్ జీవీ రామ‌కృష్ణ‌
మెద‌క్ – కే తిరుప‌తి రెడ్డి
ఆందోల్ – మాజీ ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ హుస్సేన్
ఖానాపూర్ – ఎమ్మెల్సీ దండె విఠ‌ల్
ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధ‌ర్ గౌడ్
కామారెడ్డి – ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్
బోథ్ – మాజీ ఎంపీ న‌గేశ్
వైరా – ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు
స‌త్తుప‌ల్లి – ఎంపీ పార్థ‌సార‌థి రెడ్డి
చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి
వికారాబాద్ – ఎంపీ రంజిత్ రెడ్డి
ముషీరాబాద్ – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్ర‌భాక‌ర్
అంబ‌ర్‌పేట్ – క‌ట్టెల శ్రీనివాస్ యాద‌వ్, అడ్వ‌కేట్ మోహ‌న్ రావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
మ‌క్త‌ల్ – చైర్మ‌న్ ఆంజ‌నేయులు గౌడ్
గ‌ద్వాల్ – మాజీ చైర్మ‌న్ రాకేశ్ చిరుమ‌ళ్ల‌
క‌ల్వ‌కుర్తి – చైర్మ‌న్ గోలి శ్రీనివాస్ రెడ్డి
నాగార్జున సాగ‌ర్ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామ‌చంద్ర నాయ‌క్
హుజుర్ న‌గ‌ర్ – విజ‌య‌సింహా రెడ్డి
కోదాడ – ఎమ్మెల్సీ టీ ర‌వీంద‌ర్ రావు
న‌ల్ల‌గొండ – జ‌డ్పీ చైర్మ‌న్ బండా న‌రేంద‌ర్ రెడ్డి
న‌కిరేక‌ల్ – ఎంపీ బడుగుల లింగ‌య్య యాద‌వ్
అచ్చంపేట – చైర్మ‌న్ ఇంతియాజ్ ఇషాక్
కొల్లాపూర్ – ఎంపీ రాములు
అలంపూర్ – ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి
భూపాల‌ప‌ల్లి – ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య‌
ములుగు – ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి
ఇల్లందు – ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌
వ‌రంగ‌ల్ ఈస్ట్ – మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్ర‌కాశ్
భ‌ద్రాచ‌లం – ఎమ్మెల్సీ తాత మ‌ధు
మ‌హ‌బూబాబాద్ – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్
న‌ర్సంపేట – చైర్మ‌న్ వీ ప్ర‌కాశ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
Embed widget