News
News
X

BRS Support MIM : బలం ఉన్నా మజ్లిస్ కే సపోర్ట్ - హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై కేసీఆర్ నిర్ణయం !

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయంలో మజ్లిస్‌కు మద్దతివ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.

FOLLOW US: 
Share:

BRS Support MIM :  హైద్రాబాబాద్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  ఎంఐఎంకు  మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి  13వ తేదీన  తెలంగాణ రాష్ట్రంలోని  రెండు  ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు జరగనున్నాయి.  హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో  పాటు  హైద్రాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్  టీచర్స్  ఎమ్మెల్సీ  స్థానానికి  ఎన్నికలు జరగనున్నాయి.  హైద్రాబాద్  స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానం నుండి  ఎంఐఎంకు చెందిన  సయ్యద్ హసన్  జాఫ్రీ  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాఫ్రీ పదవీకాలం  ఈ ఏడాది మే  1వ తేదీన  రిటైర్ కానున్నారు. గతంలో కూడా జాఫ్రీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. 

అధికారికంగా మిత్రపక్షాలు కాకపోయినా సహకరించుకుంటున్న మజ్లిస్, బీఆర్ఎస్ 
 
 ఎంఐఎం, బీఆర్ఎస్  అధికారిక మిత్రపక్షాలు కాకపోయినా రాజకీయంగా పరస్పరం సహకరించుకుంటున్నాయి. గతంలోలా మద్దతు ఇవ్వాలని ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను కలిసి కోరారు. కేసీఆర్ అంగీకరించారు. హైదరాబాద్ నగర మేయర్ స్థానానికి.,.  బీఆర్ఎస్ తో సమానంగా సీట్లు కార్పొరేటర్ సీట్లు ఉన్నప్పటికీ మేయర్ స్తానానికి మజ్లిస్ పోటీ చే్యలేదు. అదే సమయంలో రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన మేరకు  మద్దతు నిర్ణయం తీసుకున్నారు. 

స్థానిక సంస్థల కోటాలో బీజేపీ, మజ్లిస్ కన్నా బీఆర్ఎస్‌కే ఎక్కువ ఓట్లు                      

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం  127 ఓట్లు ఉన్నాయి. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఎనిమది మందికి కూడా ఓట్లు ఉన్నాయి. కానీ ఓ బోర్డుకు ప్రస్తుతం సభ్యులు లేరు. బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ చనిపోయారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 118గా తేలింది. ఇందులో 83 మంది గ్రేటర్ కార్పొరేటర్లు మిగతా 35 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరంతా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల కొంత మంది కార్పొరేటర్లు పార్టీలు మారారు. మొత్తంగా బీజేపీకి 33 ఓట్ల బలం ఉంటే..  బీఆర్ఎస్, మజ్లిస్‌కు కలిపి 83 ఓట్ల బలం ఉన్నట్లుగాఅంచనా వేస్తున్నారు. అయితే ఓట్ల రంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ కేసీఆర్ మజ్లిస్ పార్టీకే అనుకులంగా నిరణయం తీసుకున్నారు. 

అసెంబ్లీలో కేటీఆర్, అక్బరుద్దీన్ వాగ్వాదం - ప్రభావం లేనట్లే !                                

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో తాము వచ్చే ఎన్నికల్లో యాభై సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో రెండు పార్టీల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని అనుకున్నారు. కానీ నిర్ణయాలు తీసుకునేది కేటీఆర్, అక్బరుద్దీన్ కాదు కాబట్టి .. పై స్థాయిలో అధినేతలు సఖ్యంగానే ఉన్నారు. కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సఖ్యత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.  

Published at : 21 Feb 2023 01:46 PM (IST) Tags: Asaduddin Owaisi BRS KCR Majlis politics

సంబంధిత కథనాలు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

టాప్ స్టోరీస్

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు