BRS News : కాంగ్రెస్ కుట్రలో భాగంగానే రేవంత్ ప్రకటన - రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్
ఉచిత విద్యుత్ పైచేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీని బీఆఎస్ డిమాండ్ చేసింది. కుట్రలో భాగంగానే అలాంటి ఆరోపణలు చేశారన్నారు.
BRS News : కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య కరెంట్ మంటలు కొనసాగుతున్నాయి. రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని.. బీఆర్ఎస్ మంత్రులు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కరంట్ షాక్ తో కాంగ్రెస్ విలవిల : నిరంజన్ రెడ్డి
కరంటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయంగా, రాష్ట్రాల వారీగా ఒక విధానం అంటూ ఉన్నదా ? అని.. పల్లా రాజశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అన్నట్లు వ్యవహరిస్తున్నారని.. పొరపాటున తప్పులు మాట్లాడితే సరిదిద్దుకోవాలి కానీ ఎదురుదాడికి దిగడం పద్దతికాదన్నారు. ప్రభుత్వం లోపాలపై విమర్శించాలంటే ఆయా రంగాలపై అధ్యయనం చేసి ఆరోపణలు చేయాల్నారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నది.. రైతుకు ఎదురువచ్చి సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని గుర్తు చేశారు. రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించి చేయూతనిచ్చిన ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఒకనాడు కరంటు లేక, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగిన దుస్థితి తెలంగాణ రైతులదని.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అలాంటి సమస్యలు లేవన్నారు. శాసనసభ ఉప సభాపతిగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు కరంటు ఛార్జీల పెంపు తెలంగాణను బొందపెట్టడమే అని ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. విషయాలు తెలియని కొందరు సన్నాసులు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ఆరోపించారు. 24 గంటల కరంటు మూలంగా విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఐటీ రంగం నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. కరంటు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో అనేక రంగాల ప్రజలు ఆయా రంగాలలో ఉపాధి పొందుతున్నారని గు్తు చేశారు. 24 గంటల సరఫరా అనేది రైతుల అనుకూలత కోసం .. అవసరాన్ని బట్టి ఒకరు 8, మరొకరు 10, ఇంకొకరు 3,4 గంటలు వాడుతుండొచ్చు .. అన్నం రెడీగా ఉంటే అవసరం ఉన్నప్పుడు తింటారన్నది ప్రభుత్వ ఆలోచన అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 24 గంటల కరంటు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం .. ప్రజలకు కరంటు అందుబాటులో ఉంచాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ కుట్రే రేవంత్ నోటి వెంట వచ్చింది : జగదీష్ రెడ్డి
రైతులకు 24 గంటల ఉచిత కరంటు విషయంలో చర్చ ఎందుకు తెచ్చారు ? ఎవరు తెచ్చారు ? అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. పార, వాణిజ్య, పరిశ్రమలు, ఇండ్లకు 24 గంటల కరంటు ఉండొచ్చు .. మరి రైతాంగానికి కరంటు సరఫరా విషయంలో ఎందుకు చర్చ ? అని ప్రస్నించారు. అందరి మాదిరిగానే రైతులకు 24 గంటల కరంటు అందుబాటులో ఉంచాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అన్నారు. రాత్రి 3 గంటలు, ఉదయం 3 గంటలు అంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. గతంలో రాత్రి పూట కరంటుతో పాముకాటు వంటి ప్రమాదాలకు గురై రైతులు మరణించారు .. అందుకే 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. రైతులకు 24 గంటల కరంటు ఇస్తామని ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా చెప్పిన దాఖలాలు ఉన్నాయా ? 9 గంటలు ఇస్తామని ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ధర్నాలు చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు. దొరికిపోయిన దొంగ తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నదని.. జాతీయ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 24 గంటల ఉచిత కరంటు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసింది. దమ్మున్న వారు ముందుకు వస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్లి వద్దామన్నారు. తెలంగాణ వ్యవసాయం అంటేనే కరంటు .. గత యాసంగిలో 40 లక్షల ఎకరాలు బోరుబావులు, ఎత్తిపోతల పథకాల కిందనే సాగయ్యాయన్నారు. ఆహారం పండించి పస్తులుంటున్న రైతుకు చేయూతనివ్వాలని సంకల్పించి కేసీఆర్ ఉచిత కరంటు అమలు చేస్తున్నారని్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రనే పీసీసీ అధ్యక్షుడి నోటి నుండి బయటకు వచ్చిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
అమెరికాలో చంద్రబాబు అభిమానుల సమావేశంలో చంద్రబాబు శిష్యుడు అయిన పీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో ఉచిత కరంటు విషయంలో తెలివితక్కువ తనంతో 3 గంటలు చాలు అని బయటపట్టాడని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తే దురుసుగా, అగౌరవంగా మాట్లాడుతున్నారని.. కరంటు కొనుగోలు విషయం పారదర్శకంగా ఉంటే దాని మీద బురదజల్లడం రేవంత్ అవివేకానికి నిదర్శనమన్నారు. కరంటు ఉద్యమంపై కేసీఆర్ గారి మీద నిందలు వేయడం దుర్మార్గమని... 12 లక్షల వ్యవసాయ మోటార్ కనెక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగానే వ్యవసాయరంగంలో తెలంగాణ ముందున్నది.. వ్యవసాయ రంగం ద్వారా తెలంగాణ జీడీపీ పెంచుకున్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయని పల్లా రాజశ్వేర్ రెడ్డి గుర్తు చేశారు. మూడు గంటల కరంటు అన్న కాంగ్రెస్ పార్టీ పద్దతి మీద చర్చ జరగాల్సి ఉందన్నారు. 2601 రైతువేదికలలో కాంగ్రెస్ కరంటు విధానంపై రైతులతో చర్చ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు.