X

Breaking News: భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

FOLLOW US: 
భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్

భారత్‌లో నాలుగో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇదివరకే కర్ణాటకలో ఇద్దరికి,  గుజరాత్ లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించారు. తాజాగా మహారాష్ట్రలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. ముంబయికి వచ్చిన 33 ఏళ్ల యువకుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆపై జరిపిన టెస్టుల్లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4కు చేరుకుంది.

భారత్‌లో మరో వ్యక్తికి ఒమిక్రాన్.. జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తికి పాజిటివ్

భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇదివరకే కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ రాగా.. ఆపై జరిపిన టెస్టుల్లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది.

ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వరదల్లో ప్రాణనష్టం అధికం.. చంద్రబాబు ఆరోపణలు

రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం, తప్పిదాల కారణంగానే 60 మందికి పైగా మరణించారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణనష్టం జరిగిందన్న కేంద్రమంత్రి చేసిన ప్రకటనలకు సీఎం వైఎస్ జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

జవాద్ తుపాను ఎఫెక్ట్.. 74 రైలు సర్వీసులు రద్దు

అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను మ‌రింత బ‌ల‌ప‌డి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో 74 రైళ్ల‌ను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇందులో శనివారం (నేడు) బ‌య‌లుదేరాల్సిన 36 రైళ్ల‌ు రద్దయ్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ‌ప‌ట్నం, ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా, ఒడిశాలోని పూరీ నుంచి బ‌య‌లుదేరాల్సిన రైళ్లే అధికంగా ఉన్నాయి. మరో 38 రైళ్లు రేపు బయలుదేరనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.

హైద‌రాబాద్‌లో ఐమ్యాక్ ఏర్పాటు చేయడంపై సీఎం కేసీఆర్ హర్షం

అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (IAMC)ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో శనివారం నాడు జరిగిన ఐమ్యాక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అనేది భిన్న మతాలు, భాషలు, భిన్న సంస్కృతులకు కేంద్రమన్నారు. భాగ్యనగరంలో ఐమ్యాక్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నందుకు సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఐమ్యాక్ క్లాన్‌క్లేవ్‌లో సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఐమ్యాక్ క్లాన్‌క్లేవ్‌లో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ దేశంలో పెట్టుబడులు పెడితే లిటిగేషన్ క్లియర్ కావడానికి ఎన్నేళ్లు పడుతుందని విదేశాలలో అడుగుతారని తెలిపారు. తీర్పులు చెప్పడానికి హంగామా, ఆర్భాటం అవసరం లేదన్నారు. న్యాయం చెప్పడానికి కోర్టులే అక్కర్లేదు. అధికారులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే న్యాయం చేకూర్చవచ్చు. తప్పొప్పులు తెలుసుకుని సమస్యలు తెలుసుకునే వారు విశ్వసనీయతతో తీర్పులు చెప్పవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ మూడు జిల్లాల్లో రెస్క్యూ టీంలు మోహరింపు

తుపాను ముప్పు ఉన్న ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎన్జీఆర్‌ఎఫ్‌ పటిష్ట చర్యలు చేపట్టింది. 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 5 ఎస్డీఆర్‌ఎఫ్‌, 6 కోస్ట్‌ గార్డు, 10 మెరైన్ పోలీస్ టీమ్‌లను రంగంలోకి దింపింది. జవాద్త్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా రెస్క్యూ టీంలను మోహరించింది. ఇప్పటికే 54వేల8 మంది లోతట్టు ప్రాంతాల నుంచి శిబిరాలకు తరలించారు. 

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను... ఉత్తర,వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు దూసుకొస్తోంది. విశాఖకు 250కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 360కిలోమీటర్లు, పూరీకి 430కిలోమీటర్లు, పారాదీప్‌నకు 510కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

జవాద్ తుపాను రేపు తీరం దాటే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను... ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి రానుంది. ఐదో తేదీన ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే ఛాన్స్ ఉంది. సాయంత్రానికి పూర్తిగా బలహీనపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలా బలహీనపడిన తుపాను పశ్చిమ బంగా వైపు వెళ్లిపోనుంది. శనివారం తుపాను ప్రభావంతో చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.  తక్కువ ప్రాంతాల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఒడిశా దక్షిణ కోస్తా , ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. ఉదయం 10.59 నిమిషాలకు మొదలైన గ్రహణం మధ్యాహ్నం 12.30కు సంపూర్ణమవుతుంది. మధ్యాహ్నం 1.33 నిమిషాలకు సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది. అప్పట్నించి గ్రహణం వీడడం మొదలై మధ్యాహ్నం 3.07 నిమిషాలకు పూర్తిగా విడుస్తుంది. అంటే మొత్తం నాలుగ్గంటలకు పైగానే గ్రహణ సమయం వస్తోంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కావడంతో పలు దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. 

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) గాంధీభవన్‌లో శనివారం భేటీ కానుంది. తెలంగాణలో 9 నుంచి క్షేత్రస్థాయిలో డిజిటల్‌ సభ్యత నమోదు కార్యక్రమాలను చేపట్టనున్నారు. అయితే క్షేత్రస్థాయి డిజిటల్‌ సభ్యత్వ నమోదులో కీలకమైన ఎన్‌రోలర్ల నియామకం ఇంకా పూర్తి కాలేదు. ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షతో పాటు రైతుల సమస్యలు, డిజిటల్‌ సభ్యత నమోదు అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. 

పసిడి ప్రియులకు శుభవార్త. భారత మార్కెట్లో బంగారం ధర వరుసగా నాలుగోరోజు స్వల్పంగా దిగొచ్చింది. తాజాగా 22 క్యారెట్లపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత)పై రూ. 160 మేర తగ్గడంతో ధర రూ.48,490 కి పతనమైంది. ఇక వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత తగ్గింది. రూ.300 మేర పుంజుకోవడంతో తాజాగా కిలో రూ.65,300కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు ఉంటున్నాయి. 

ఇక విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగాపెరిగి. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారంపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర నేడు రూ.44,450 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,490గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది.

ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ధరలు తగ్గించడంతో నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.69... డీజిల్ ధర రూ.94.14 గా విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరుకు రూ.0.20 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ.110.71 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.19 పైసలు తగ్గడంతో రూ.96.77గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర భారీగా పెరిగింది. 0.94 పైసలు పెరగడంతో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.99గా ఉంది.   డీజిల్ ధర 87 పైసల మేర పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.96.05కి చేరింది. 

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!