అన్వేషించండి

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

డప్పుల చప్పుళ్లు,శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల ప్రదర్శనలతో ఆషాడమాసమంతా ఊరూరా బోనాల జాతరే. అందులోనూ బోనాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ లో పండుగ కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం ఆరంభం నుంచి  ఊరూరా మొదలయ్యే సందడి  నెల రోజులు కొనసాగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ప్రతిపల్లె హోరెత్తిపోతోంది. ఈ ఏడాది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూనే సంబురాలు జరుగుతున్నాయి.

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆది, బుధవారాల్లో బోనాల జాతర జరుగుతుంది. గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం  బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.

తెలంగాణకు ప్రత్యేకమైన బోనాల జాతరను కాకతీయుల కాలంనుంచే  నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. అప్పట్లో ఈ సీజనల్లో వర్షాలు ఎక్కువగా కురిసేవి. పారిశుద్ధ్య లోపంతో కలరా, ప్లేగు లాంటి అంటురోగాలతో అల్లాడేవారు. ఈ రోగాల బారి నుంచి కాపాడాలని ప్రజలు శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని కొలుస్తారు.

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యం. పండుగరోజు తెల్లవారుజామున మహిళలు మట్టిపాత్రల్లో కట్టెల పొయ్యిపై అమ్మవారికి నైవేద్యం వండుతారు. వండడం పూర్తయిన తర్వాత కుండను శుభ్రపరిచి పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరిస్తారు. దానిపై దీపం వెలిగిస్తారు. తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మవార్లకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, పిల్లా పెద్దా చల్లగా ఉండాలని అమ్మను వేడుకుంటారు.

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాకను సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేస్తారు. కడుముంతలో పోసి దానిపై దివ్వెపెట్టి బోనం జ్యోతి వెలిగిస్తారు. ఆ తీర్థంలో వేపకొమ్మలు ఉంచి ,బోనంపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

బోనాల పండుగ  ఊరేగింపులో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీరు ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో భవిష్యవాణి వినిపిస్తారు. గ్రామ దేవతలైన ఓరుగంటి రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెల్లకు ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు, అక్క ఎల్లమ్మ ఆరుగురు చెల్లెళ్లకు ఒక్కో పండుగను ఏర్పాటు చేసింది. అయితే తమ్ముడికి ఎలాంటి పండుగను ఏర్పాటు చేయలేకపోయానని ఎల్లమ్మ బాధ పడుతుండగా పోతరాజు, మీరు వెలిసిన గ్రామాల్లోకి నుంచి దుష్టశక్తులు చొరబడకుండా గ్రామ పొలిమేరల్లో నేను కాపలాగా ఉండి కాపాడుతానని ఎల్లమ్మకు చెప్పినట్టు పురాణ కథ ప్రచారంలో ఉంది.

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

ఆషాడమాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు ఈ ఏడాది ఆగస్టు 8 తో ముగుస్తున్నాయి. ఈ సంప్రదాయం కులికుతుబ్‌షా కాలం నుంచి వస్తోంది. లంగర్‌హౌజ్‌ నుంచి తొట్టెల ఊరేగింపు, చోటాబజార్‌ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం నిర్వహించడం కూడా సంప్రదాయం.

Aashada bonalu:కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం

బోనాల పండుగ కోసం ప్రభుత్వం ఈ ఏడాది 15కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటూ జరిగే బోనాల్లో ముఖ్య ఘట్టాలైన లష్కర్ బోనాలు జూలై 25న, రంగం కార్యక్రమం జూలై 26న జరగనున్నాయి.

ఈ ఏడాది బోనాల షెడ్యూల్ ఇది…

జూలై 11న మొదటి పూజ 

15న  2వ పూజ

18న  3వ పూజ

22న  4వ పూజ

25న  5వ పూజ, 

29న 6వ పూజ

ఆగస్టు 1న 7వ పూజ 

5న  8వ పూజ

8న  9వ పూజ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget