అన్వేషించండి

Seethakka Fires on BJP Leader: ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్

Telangana News | తనను ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా అందంగా మారుస్తానంటూ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు.

Telangana Minister Seetakka Comments | ఆదిలాబాద్: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రియాంకా గాంధీ మీద బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ర‌మేష్ బిధూరి వ్యాఖ్య‌లు మ‌హిళా లోకానికే అవ‌మానక‌రం, ప్రతి ఒక్కరూ బీజేపీ నేత వ్యాఖ్యల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఓ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరి బేషరతుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

మహిళలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందా ?

బీజేపీ పెద్దలు ఇకనైనా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తే మ‌హిళ‌లు స్వేచ్చ‌గా, నిర్బ‌యంగా తిరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీలో మహిళా వ్యతిరేకత చాలా ఉంది. అందుకే ర‌మేష్ బిధూరిని బీజేపీ పెద్దలు వెన‌కేసుకొస్తున్నారు. మహిళను అందులోనూ ప్రజాప్రతినిధి శరీరాన్ని రోడ్లతో పోల్చి తన దుర్బుద్ధి, దురుద్దేషం, పురుష దురకారాన్ని బయటపెడితే బీజేపీ మద్దతిస్తోంది. వికృత చేష్ట‌ల‌తో బీజేపీ ఆడ‌వాల్ల‌ను అవ‌మాన ప‌రుస్తోంది. ఆ పార్టీకి మ‌హిళ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయం అనిపిస్తోంది. మనుధర్మ శాస్త్రాన్ని అవలంభించడమే వారి మూల సిద్ధాంతం. ఆ శాస్త్రంలో మహిళలను గౌరవించిన చరిత్ర లేదు. వారికి మహిళల్ని గౌరవించడం తెలియదు. - మంత్రి సీతక్క

ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కనక గెలిపిస్తే కల్కాజీలోని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల లాగ నున్నగా మారుస్తానని చెప్పడంతో వివాదం మొదలైంది. తాను చేసింది అని భావిస్తే.. ముందుగా లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన, కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు.ఓక వీడియోలో, రమేష్ బిధురి మాట్లాడుతూ, ‘బిహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లాగ అందంగా చేస్తానని గతంలో లాలూ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీ నేత అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే.. తాను కూడా ప్రియాంక గాంధీకి సారీ చెబుతా అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వారే మహిళలా, వారికే ఆత్మగౌరవం ఉంటుందా.. బీజేపీ మహిళా నేతలకు ఆత్మ గౌరవం, విలువ ఉండవా అని ఎదురు ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. 

Also Read: KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget