News
News
X

BJP To Highocurt : సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు చేయించాలి - ఫామ్ హౌస్ కేసుపై హకోర్టును ఆశ్రయించిన బీజేపీ !

ఫామ్ హౌస్ కేసును సీబీఐ లేదా సిట్‌తో విచారణ చేయించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు.

FOLLOW US: 
 
BJP To Highocurt :  మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకుప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ కోరింది. 8 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం  , డీజీపీ (DGP), సైబారాబాద్‌ సీపీ, రాజేంద్రనగర్‌ ఏసీపీ, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో, కేంద్రం, సీబీఐని ప్రతివాదులుగా బీజేపీ చేర్చింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపై పిటిషన్‌లో బీజేపీ  అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కోర్ట్ పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని హైకోర్టును బీజేపీ కోరింది.సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 

టీఆర్ఎస్ డ్రామా అని బండి సంజయ్ ఆరోపణ

మునుగోడు ఉప ఎన్నికలో గెలవడానికి కేసీఆర్ అండ్ టీం ఆడిన డ్రామా ఫెయిల్ అయిందని..  హైడ్రామా వ్యవహారానికి సంబంధించి కొత్త కొత్త వీడియోలు, ఆడియోలను తయారు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలపై హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.ఈ ప్రకటన చేసిన కాసేపటికే పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. మరో వైపు ఈ కేసులో  అరెస్టు చేసిన స్వామీజీతో పాటు మరో ఇద్దర్ని అక్కడే ప్రశ్నిస్తున్నారు. ముగ్గురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరితో టచ్ లోఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. 

అన్ని పార్టీల లీడర్లతో నందు ఫోటోలు

News Reels

 నందు అనే వ్యక్తి పొలిటికల్ లీడర్లతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఫాం హౌస్ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురిని పోలీసులు మరికాసేపట్లో రాజేంద్ర నగర్ ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసులు వారి రిమాండ్ రిపోర్టును రెడీ చేస్తున్నారు. అజీజ్ నగర్ ఫాం హౌస్లో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మరోసారి తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే నిన్న డబ్బులున్నట్లు చెబుతున్న బ్యాగుల్లో ఏమీ దొరకలేదని ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఆ డబ్బు సంచుల్ని ఓపెన్ చేసి చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు ఈ రోజు మరోసారి ఫాంహౌజ్ లో తనిఖీలు నిర్వహించారు. మొయినాబాద్ ఫాంహౌజ్ లోపలికి ఎవర్నీ అనుమతించడం లేదు.

పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ 

తనను బీజేపీ నేతలు ప్రలోభపరిచారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు.  ఒకవేళ తాను బీజేపీలో చేరని పక్షంలో ఈడీ, సీబీఐ దాడులు, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం కూలదోస్తామని హెచ్చరించినట్లు రోహిత్ రెడ్డి కంప్లైంట్లో ప్రస్తావించారు. 

Published at : 27 Oct 2022 04:00 PM (IST) Tags: Telangana High Court TS Bjp Telangana Police Farm House Case Bribery Case of MLAs

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Bandi Sanjay on Sajjala Comments : కమీషన్ల ఒప్పందంతో ఇద్దరు సీఎంలు డ్రామాలు, కవిత కేసు పక్కదోవ పట్టించేందుకు కుట్ర - బండి సంజయ్

Bandi Sanjay on Sajjala Comments : కమీషన్ల ఒప్పందంతో ఇద్దరు సీఎంలు డ్రామాలు, కవిత కేసు పక్కదోవ పట్టించేందుకు కుట్ర - బండి సంజయ్

Bhadradri Kothagudem Politics : ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా చర్చ!

Bhadradri Kothagudem Politics : ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా చర్చ!

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

Hyderabad Crime News: కోరిక తీర్చు, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతా - టీవీ యాంకర్ ను వేధిస్తున్న యువకుడు!

టాప్ స్టోరీస్

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Gujarat Election Results 2022: పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఘన విజయం, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీ

Gujarat Election Results 2022: పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఘన విజయం, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీ

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!