అన్వేషించండి

TSPSC Politics : పేపర్ లీక్ చుట్టూ రాజకీయాలు - దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ , బీఆర్ఎస్ !

తెలంగాణలో పేపర్ లీకేజీ కేంద్రంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.


TSPSC Politics :    తెలంగాణ రాజకీయాల్లో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం సంచలనం అవుతోంది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు బయటపడగానే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యకర్త అని   కేటీఆర్‌ రిట్వీట్‌ చేశారు. ఈ విషయంలో తగిన దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరారు. రాజకీయ పార్టీగా బీజేపీ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిణామం ఆ పార్టీ మరింత దిగజారుడు రాజకీయా లకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

 ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బీజేపీ పార్టీ నిరుద్యోగ యువత భవిష్యత్‌ను ఫణంగా పెట్టి కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తగిన విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు. ఈ లీకేజీ విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.  పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరేనని  టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే.. మరి ఆయనను బర్తరఫ్ చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జరిగిన పోరాటంలో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను గురువారం బండి సంజయ్ పరామర్శించారు.  అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయింది..? టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌కు తెలియకుండా ఎట్లా లీకైంది..? ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలన్నారు.  నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్‌లు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు.  కేసీఆర్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండే. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కొడుకు పాత్ర క్లియర్‌గా ఉంది. ఐటీశాఖ ఫెయిల్యూర్ ఉంది. అయినా కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదు. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త డ్రామా చేస్తున్నారని విమర్శించారు. 


పైగా బీజేపీ పాత్ర ఉందని సిగ్గు లేకుండా ఆరోపిస్తున్నారు.. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారు.. 2017 నుంచి అతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి. ఐటీశాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు..? అట్లాంటివాళ్లను గుర్తించడం చేతగాని నువ్వు మంత్రిగా ఉండటానికే అనర్హులు అని మండిపడ్డారు. అదే్ సమయంలో మరో నిందితురాలు రేణుకా రాథోడ్ తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అన్న విషయాన్ని బండి సంజయ్ ట్వీట్ ద్వారా తెలిపారు. 

 పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్‌దంటూ ఫైర్ అయ్యారు. కనీసం టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించడం చేతగావడం లేదని విమర్శించారు. దొంగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మొత్తంగా పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Embed widget