అన్వేషించండి

Bathukamma 2021: జిల్లాలకు చేరిన బతుకమ్మ చీరలు.. ఈసారి 290 రకాల్లో.. ఇలా పొందొచ్చు

గతేడాది మహిళల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 ల్లో సరికొత్తగా చీరలు నేయించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరలు సిద్ధం అయ్యాయి. ఈ సారి మరిన్ని రంగుల్లో చీరలను నేయించారు. వచ్చే దసరా పండుగలోపు వీటన్నింటికీ అర్హులందరికీ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికీ చీరలన్నీ జిల్లా కేంద్రాలకు కూడా చేరాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. అక్టోబరు 2 నుంచి చీరల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సారి సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేయించారు. 

గతేడాది చీరల పంపిణీ సందర్భంగా కేటీఆర్‌ ఆదేశాల మేరకు మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆ సూచనలను బట్టి ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 రంగులు, రకాల్లో సరికొత్తగా చీరలు నేయించారు. డాబీ అంచు చీరలు ఈ సారి బతుకమ్మ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకురానుందని అధికారులు తెలిపారు. ఆ పంపిణీ చేసే చీరల ప్యాకింగ్‌ను కూడా అధికారులు ఆకర్షణీయంగా చేశారు. చీరల పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లు డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

రేషన్ కార్డు చూపి చీర పొందేలా ఏర్పాట్లు
బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ఈసారి ఏకంగా రూ.318 కోట్లను ఖర్చు చేసింది. దాదాపు 16 వేల మగ్గాలపై 10 వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గ్రామాల్లో రేషన్‌ డీలర్‌, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన ఓ కమిటీ పంపిణీని పర్యవేక్షిస్తుంది. పట్టణాలు, నగరాల్లో రేషన్‌ డీలర్‌, మున్సిపల్ బిల్‌ కలెక్టర్‌, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. రేషన్ సరకులు తీసుకునే ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకొనేందుకు అవకాశం కల్పించారు.

అయితే, బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. 31 జిల్లాల్లో చీరలు పంచనున్నారు. కానీ, హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వల్ల కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో చీరల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget