అన్వేషించండి

8 Hour Shift: దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?

Deepika Singh On 8 Hour Shift: తాను 8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని దీపికా పదుకోన్ కండిషన్ పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ ఏం చెప్పారంటే?

దీపికా పదుకోన్ (Deepika Padukone) ఎయిట్ అవర్స్ షిఫ్ట్ కండిషన్ మీద పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' టీం అప్రోచ్ అయినప్పుడు ఆమె పెట్టిన కండిషన్లలో అదొకటని ప్రచారం జరిగింది. దీపికాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, అది సరికాదని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. సినిమాల్లో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత హీరోయిన్లు చెప్పింది చెల్లుతుందేమో... కానీ సీరియల్ స్టార్స్ ఇంకా పది పన్నెండు గంటలకు పైగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సీరియళ్ళలో కూడా 8 అవర్స్ మాత్రమే షూటింగ్ చేసేలా షిఫ్ట్ పెట్టాలని చర్చ జరుగుతోంది. దానిపై హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ చెప్పిన మాటలు దీపికా పదుకోన్‌కు కౌంటర్ అన్నట్టు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

నేను 13-14 గంటలు పని చేస్తాను - నటి దీపికా సింగ్
ఒక షిఫ్టులో 8 గంటలు మాత్రమే నటించాలని జరుగుతున్న వాదనపై ప్రముఖ హిందీ టీవీ సీరియల్ నటి దీపికా సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన వృత్తిని కేవలం పనిగా కాకుండా ఒక అభిరుచిగా భావిస్తానని, అందుకే ఎన్ని గంటలు నటించాలి? ఎన్ని గంటలు పని చేస్తున్నాను? అనే దాని గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని, చెందను అని తెలిపారు.

Also ReadJailer 2 - రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

ఒక ఇంటర్వ్యూలో దీపికా సింగ్ మాట్లాడుతూ... ''నేను నా పాత్రలో పూర్తిగా లీనం అయిపోతాను. నటిగా సన్నివేశాలు బాగా రావడానికి, నటనలో నాణ్యతను పెంచడానికి ఎక్కువ సమయం కేటాయించడం నాకు సాధారణమైన విషయం. నేను 12 గంటల షిఫ్ట్ చేసిన (నటించిన) తర్వాత కూడా ఇంకా సీన్లు మిగిలి ఉంటే... 13 లేదా 14 గంటలు కూడా పని చేస్తా. తక్కువ సమయం ఇస్తే మన సన్నివేశాలు సరిగా రావు. అలాగే దర్శకులకు సీన్లను మెరుగ్గా తీర్చిదిద్దడానికి తగినంత అవకాశం ఉండదు" అన్నారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే షిఫ్ట్ గురించి ఆలోచన వస్తుందని ఆమె అన్నారు. 

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హిందీ టెలివిజన్ రంగంలో అడుగు పెట్టానని దీపికా సింగ్ తెలిపారు. ''నేను మే 5, 2011న ముంబైకి వచ్చా. తొలినాళ్లలో రైలులో ప్రయాణించా. కానీ ముంబై తనకు పేరు, ప్రఖ్యాతులతో పాటు విమానాల్లో ప్రయాణించే స్థాయి ఇచ్చింది. అప్పుడే అలసిపోతే భవిష్యత్తులో ఏం సాధించగలను? ఇంకా చేయాల్సినది, చూపించాల్సినది చాలా ఉంది" అని దీపికా సింగ్ తెలిపారు. హిందీ సీరియల్ 'దియా ఔర్ బాతి హమ్'లో సంధ్య రాఠీ పాత్రతో దీపికా సింగ్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం 'మంగళ లక్ష్మి'లో నటిస్తున్నారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget