By: ABP Desam | Updated at : 27 Sep 2023 05:03 PM (IST)
మోదీ తెలంగాణకు ఎందుకు రాకూడదు - కేటీఆర్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు !
Bandi On KTR : ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు ఎందుకు రాకూడదు? కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలిచ్చింది. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అంతెందుకు? తెలంగాణకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? డేట్, టైం ఫిక్స్ చేయండి అని బండి సంజయ్ కేటీఆర్‌కు సవాల్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని కోతిరాంపూర్ చౌరస్తా వద్దనున్న లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బాపూజీ సేవలను స్మరించుకున్నారు. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు.
పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు కిషన్ రెడ్డిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా… నువ్వో లేక మీ అయ్యో బహిరంగ చర్చకు సిద్ధమా? ఇదే ఎన్నికల రెఫరెండంగా తీసుకుందాం.… నా సవాల్ ను స్వీకరించాలి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రధానిని విమర్శించే కనీస అర్హత కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ లేకుంటే నీకున్న అర్హత ఏంది? మోడీ, కిషన్ రెడ్డి నీ లెక్క అయ్య పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు.. పదవులు సంపాదించలేదు? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అవమానించిన మూర్ఖుడివి నువ్వు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
పాలనలో మంత్రి కేటీఆర్ అన్ ఫిట్ అని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ కొడుకు.. కేటీఆర్ అంతేనని.. అంతకు మించి ఏమీ లేదన్నారు. తెలంగాణలో అడుగుపెట్టే అర్హత మోదీకే ఉందని... మీ కుటుంబానికి లేదన్నారు. కృష్ణా జలాల వాటాపై కేసీఆర్ మోసం చేశారన్నారు. ఒక్క మోటార్ తో పది లక్షల ఎకరాల పారుతుందా? అని ప్రశ్నించారు. మన పాపాన కేసీఆర్ చెడ పుట్టిండని బండి సంజయ్ అన్నారు. ‘‘భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు రా కేటీఆర్.. మేము ఇచ్చిన నిధులపై చర్చిద్దాం.. ఎన్నికలకు ఇదే రెఫరెండం. నువ్వు కేసీఆర్ కొడుకువే అయితే రా.. నీకు దమ్ముంటే..నీలో తెలంగాణ రక్తం ఉంటే రా కేటీఆర్.. నువ్వెంత.. నీ బతుకు ఎంత..?’’ అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మోదీ పర్యటనపై విమర్శలు చేశారు. అక్టోబర్ ఒకటిన ప్రధాని మహబూబ్‌నగర్ వస్తున్నారని.. ఈ సందర్భంగా ప్రధానికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిపారు. ‘‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు. పదేళ్లుగా రాష్ట్ర ఏర్పాటుపై ఎందుకు విషం చిమ్ముతున్నరు. పార్లమెంట్‌లో పలు మార్లు తెలంగాణను కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడారు’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు అనడం వారి అజ్ఞానమన్నారు. 2014లో పుట్టగతులు లేకుండా పోయినట్లు రాబోయే ఎన్నికల్లో కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. త్యాగాలను అవమానించిన ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో కాలు పెట్టే అర్హత కూడా ప్రధాని లేదన్నారు. ఈ విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Telangana Elections Results 2023: తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా వీళ్ల ఓటమి మాత్రం పెద్ద షాక్
Telangana Election Results 2023 LIVE: తెలంగాణ ఎన్నికల్లో 'కాంగ్రెస్' ఘన విజయం - ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.?
Nizamabad Assembly Election Results 2023: నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Is Telangana BJP Happy : 8 సీట్లలో గెలిచిన బీజేపీ - ఇవి మెరుగైన ఫలితాలా ? ఎక్కడో ఉండాల్సిన పార్టీని అక్కడే ఉంచేసుకున్నారా ?
DGP Anjani kumar Suspension: ఈసీ సంచలన నిర్ణయం, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై వేటు!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>