అన్వేషించండి

Attack on BRS MP: బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి - ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం- నిందితుడిని చితకబాదిన కార్యకర్తలు

Attack on BRS MP: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి జరిగింది. సోమవారం ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీ పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రచారంలో భాగంగా సూరంపల్లిలో ఓ ఫాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా కరచాలనం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీకి తీవ్ర గాయాలు కాగా భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ తరలింపు

నారాయణ్ ఖేడ్ సభకు వెళ్తుండగా విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయలుదేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు, వైద్యులను ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. అయితే, ముందు జాగ్రత్తగా మెరుగైన వైద్యం కోసం హరీష్ రావు సూచనతో ఎంపీని హైదరాబాద్ తరలించారు.

ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై గజ్వేల్ వైద్యులు స్పందించారు. ఎంపీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

నిందితుడి అరెస్ట్

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. ఎంపీకి షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పి ఈ దాడికి పాల్పడ్డాడు. కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా ఆగ్రహం చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిందితున్ని చితకబాదారు. కర్రలతో కొట్టి, కాళ్లతో తన్నారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం మెదక్ లోక్ సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతు - ప్రజల కోసం 6 షరతులు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget