అన్వేషించండి

Telangana: దేవుడి భూమల కబ్జాకు యత్నం - అడ్డుకున్న ఈవోపై దాడి - భద్రాచలంలో దారుణం

Bhadrachalam: భద్రాచలం ఆలయం భూముల్నికబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఆపేందుకు ప్రయత్నించిన ఈవోపై దాడి చేశారు

Bhadrachalam EO attacked by Land Mafia:    భద్రాచలం  సీతారామచంద్రస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  రమాదేవి పై  పురుషోత్తపట్నంలో  దాడి జరిగింది.  ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూములను ఆక్రమణ నుండి కాపాడేందుకు రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి వెళ్లిన సమయంలో జరిగింది. 

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం  గ్రామం ఉంది. ఈ గ్రామంలో  భద్రాచలం ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఉంది.  సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆలయ ఆస్తిగా గుర్తించారు. అయితే ఈ భూములను కొంత మంది ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన  ఆలయ ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి, పురుషోత్తపట్నం వెళ్లారు.  ఆలయ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించారు.  ఈ భూములు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నందున, ఆక్రమణదారులను తొలగించడంలో ఆలయ అధికారులు గతంలో కూడా  ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. 

ఈ క్రమంలో ఆలయ ఈవో స్వయంగా వెళ్లారు.   ఆలయ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక ఆక్రమణదారులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం తీవ్రమై, ఆక్రమణదారులు రమాదేవిపై   దాడికి పాల్పడ్డారు. దాడి కారణంగా రమాదేవి స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది , స్థానికులు ఆమెను వెంటనే  భద్రాచలం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు, అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ఈ ఘటనపై దేవాదాయ మంత్రి కొండా సురేఖ స్పందించారు. దేవుడి భూములు ర‌క్షించే ఈవోల‌పై దాడి  చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా... రూల్స్ విరుద్ధంగా ఎండోమెంట్ భూముల‌ను క‌బ్జా చేస్తే పీడీ యాక్టు పెడుతాం.... ఈ విష‌యంలో గ‌తంలోనూ తాము స్ప‌ష్టం చేశామని హెచ్చరించారు. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయ‌డం స‌హేతుకం కాద‌ని.. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం.... ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని... స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేయాల‌ని కోరారు.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు.       

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget