News
News
X

Breaking News Live Telugu Updates: అవనిగడ్డలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్, చెలరేగిన మంటలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
అవనిగడ్డలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్, చెలరేగిన మంటలు 

Krishna District : కృష్ణా జిల్లా అవనిగడ్డలో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిన వీడియో వైరల్ అవుతోంది. స్థానికంగా డ్రైనేజ్ పనులు నిర్వహిస్తున్నప్పుడు ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. జేసీబీ తగలటంతో పైప్ లైన్ డ్యామేజ్ అయింది. పైప్ లైన్  నుంచి గ్యాస్ లీక్ అయి మంటలు వచ్చాయి. అక్కడే అందుబాటులో ఉన్న మేఘా గ్యాస్ సిబ్బంది గ్యాస్ సరఫరా నిలిపి వేసి మంటలు అదుపులోకి తెచ్చారు. పైప్ లైన్ కు మరమ్మతులు చేశారు.

చిత్రానదిలో కొట్టుకుపోయిన ఆటో, డ్రైవర్ గల్లంతు 

Satyasai District News : సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని చిత్రానదిలో ఆటో కొట్టుకుపోయింది. కర్ణాటకలో అధిక వర్షాలతో చిత్రానది పొంగిపొర్లుతుంది. చిలమత్తూరు మండలం సుబ్బరావుపేట వద్ద పొంగిప్రవహిస్తున్న వాగును దాటేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ప్రవాహంలో ఆటోతో పాటు డ్రైవర్ కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులు గాలిస్తున్నారు. 

Ambati Rambabu: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల

నాగార్జున సాగర్ కుడి కాలువకి నీటిని విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 

తాగు, సాగు అవసరాల నిమిత్తం కుడి కాలువకి 2 వేల క్యూసెక్కులు, పవర్ జనరేషన్ ద్వారా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఎగువన  ఉన్న కృష్ణా నది డామ్ లు అన్ని  నిండు కుండలా తలపిస్తున్నాయి అని రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ డ్యాం కూడా నిండే అవకాశం ఉందని ముందు గానే సాగు, తాగు నీటి కోసం నీటిని  విడుదల చేస్తున్నామని మంత్రి అంబటి అన్నారు.

భగవంతుని దయ వల్ల రాష్ట్రంలోని డామ్ లు అన్ని జల కళని సంతరించుకున్నాయని అన్నారు.

Harish Rao: ఇంటి చుటుపక్కల చెత్త ఎత్తిన మంత్రి హరీశ్ రావు

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.డెంగ్యూ నివారణ లో భాగంగా మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లిన్ చేశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని, ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి  పిలుపునిచ్చారు.

Harish Rao: ఇంటి చుటుపక్కట చెత్త ఎత్తిన మంత్రి హరీశ్ రావు

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.డెంగ్యూ నివారణ లో భాగంగా మంత్రి హరీష్ రావు తన నివాస ప్రాంగణంలో పారిశుద్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్ర పరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లిన్ చేశారు. ప్రజలంతా ఇంటిలోని అన్ని నీటి స్తబ్దత పాయింట్లను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని, ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. డెంగ్యూ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్త చేదారం , నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి  పిలుపునిచ్చారు.

Tirumala Updates: తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కేంద్ర సహాయక మంత్రి ఎల్.మురుగన్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

Chittoor News: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్, ఒకరు మృతి

గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలోని ఓఎన్ కొత్తూరు పంచాయతీ శ్రీనివాసపురం పరిసరాలలో తిష్ట వేసిన ఏనుగుల మంద ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో ఏక్షణంలో ఎటువైపు నుంచి వచ్చి ఏనుగులు దాడి చేస్తాయో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు గ్రామస్థులు.. ఎన్ని జాగ్రతలు తీసుకున్న చుట్టూ అటవీ ప్రాంతం విస్తరించి ఉండటంతో ఏదో ఒకరూపంలో ఏనుగులు దాడులు చేస్తూనే ఉన్నాయి. నిన్న రాత్రి గ్రామ సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో పాటు చీకటిగా ఉండటంతో ఏనుగుల మందను గ్రహించక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఒక్కసారిగా ప్రజల మీదకు దాడి చేయడంతో ఏనుగుల దాడిలో తమిళనాడుకు చెందిన గోవిందప్ప సంఘటన స్ధలంలోనే మృతి చెందాడు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన నాగరాజు తీవ్ర గాయపడ్డాడు.. దీంతో గ్రామస్థులు అప్రమత్తమై ఏనుగుల మందను అడవిలోకి తరిమి గాయపడ్డ వారిని కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు..‌ ప్రతినిత్యం ఏనుగులు దాడులు జరిగి ప్రజల ప్రాణాలతో పాటు పంట నష్టం జరుగుతున్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

Background

నైరుతి రుతుపవనాలు, ఉతరితల ఆవర్తనం ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో ఆగస్టు 3 వరకు భారీ వర్షాలు కురవనుడగా, తెలంగాణలో ఆగస్టు 4 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణలో భారీ వర్షాలు 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టు 4 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 3 వరకు  తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల పడతాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో కేవలం ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం.  

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.