అన్వేషించండి

Breaking News Live Telugu Updates: రేణిగుంట శ్రీవారి ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates:  రేణిగుంట శ్రీవారి ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం

Background

ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు పెరిగాయి. ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం వాతావరణ విభాగం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. డిసెంబరు 26 మాల్దీవులు, దానిని ఆనుకొని ఉన్న కొమోరిన్ ప్రాంతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం బలహీనపడిందని తెలిపారు. ఏదైమైనప్పటికీ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతం మీద సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో మొన్నటి వరకూ (డిసెంబరు 28) స్వల్పంగా వర్షాలు పడ్డాయి.

ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని డిసెంబరు 28 నాటి వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

మన్యం జిల్లాలో పెరుగుతున్న చలి
మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మూడు రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. చింతపల్లి 10, లంబసింగి 8, డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పాడేరు, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పదిన్నర గంటల వరకు కూడా పొగ మంచు దట్టంగా కనిపిస్తుండగా, ఆ తరువాత నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఎండ కాస్తున్నది. మళ్లీ నాలుగు గంటల నుంచి యథావిథిగా చలి మొదలవుతుంది.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.

పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.

16:48 PM (IST)  •  30 Dec 2022

రేణిగుంట శ్రీవారి ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం

రేణిగుంట శ్రీకాళహస్తి ప్రధాన రహదారి శ్రీవారి ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. మంటలు ఎగిసిపడుతున్నాడంతో స్థానికులు బయందోళనకు గురవుతున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీవో రామారావు, రేణిగుంట ఎంపీడీవో హరిబాబు, తహసీల్దార్ శివప్రసాద్,VRO, చంద్రశేఖర్, చంద్ర సీఐ సుబ్బారెడ్డి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.

10:32 AM (IST)  •  30 Dec 2022

Ramachandra Bharathi: చంచల్ గూడ జైలు నుంచి రామచంద్రభారతి విడుదల

  • చంచల్ గూడ జైల్ నుండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల
  • నకిలీ పాస్‌పోర్ట్ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర భారతి
  • జ్యుడీషియల్  రిమాండ్‌లో ఉన్న రామచంద్ర భారతి బెయిల్‌పై విడుదల
  • నిన్న బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
09:12 AM (IST)  •  30 Dec 2022

Rishabh Pant Road Accident: క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం

క్రికెటర్ రిషభ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. పంత్ కారు ఒడిశాలోని రూర్కీ దగ్గర డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగి తగలబడింది. తీవ్ర గాయాలతో బయటపడ్డ రిషభ్ పంత్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget