అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

Background

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో సీజన్‌లో చివరిసారి వీటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఆదివారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు ఆవర్తనాల ప్రభావంతో నేడు, రేపు రెండు రోజులపాటు ఏపీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. 

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 3, 4 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం సైతం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగాల్లో కురుస్తున్న వర్షాలు, పిడుగులు ఆంధ్ర - తెలంగాణ బార్డర్ ప్రాంతాల వైపుగా వస్తున్నాయి. 

నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచననున్నాయి. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడని ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ఉక్కపోత అధికం అవుతుంది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వైజాగ్ లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరో వైపున పార్వతీపురం మణ్యం జిల్లాలోని సాలూరు - యస్.కోట వైపు వర్షాలు పెరగనుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కళితో పాటుగా కాకినాడ జిల్లాలోని ఉత్తర భాగాల్లో కూడ వర్షాలుంటాయి. విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. విజయనగరం భోగపురం - ఆనందపురం వైపు నుంచి వచ్చే మేఘాలతో వైజాగ్ ఉత్తర భాగాలైన భీమిళి, రిషికుండ, మధురవాడ వైపు వర్షాలు విస్తారంగా ఉంటాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 3, 4 తేదీల్లో గుంటూరు, ఎన్.టీ.ఆర్ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. ఒంగోలు - సింగారాయకొండ బెల్ట్ తో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.  
రాయలసీమలోనూ నేడు స్వల్ప వర్షాలున్నాయి. నంద్యాల, కర్నూలు జిల్లా సహా సీమ జిల్లాల్లో పిడుగులే పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

21:48 PM (IST)  •  03 Oct 2022

కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

కూకట్‌పల్లి బాలానగర్ మెట్రో స్టేషన్ కింద జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ లో మంటలు చెలరేగి కారు ముందు భాగానికి మంటలు వ్యాపించాయి.  అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగిపోయారు.   అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.  

20:28 PM (IST)  •  03 Oct 2022

కోతులు వెంటబడటంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు

నిజామాబాద్ మాక్లూర్ మండలం మామిడి పల్లిలో విషాదం నెలకొంది. కోతులు వెంటబడటంతో నలుగురు చిన్నారులు పరుగులు పెట్టి చెరువులో దూకారు. ఇద్దరు మృతి మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు.  

19:13 PM (IST)  •  03 Oct 2022

భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం 

భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. రోగులను మరో ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

15:00 PM (IST)  •  03 Oct 2022

Malakpet Police: మలక్ పెట్ లో ఆపరేషన్ రోప్ అమలుపై తనిఖీలు

మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నో పార్కింగ్  జోన్ లో దుకాణాల ముందు అక్రమ పార్కింగ్ వాహనాలను  వీల్ లాక్స్ వేసి సీజ్ చేశారు. ఫుట్ పాత్ లపై వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుండి ఆపరేషన్ రోప్ అమల్లోకి రావడంతో మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో మలక్ పేట పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫుట్ ఫాత్ లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసిన జరిమానా తప్పదని అన్నారు.

14:42 PM (IST)  •  03 Oct 2022

Vemulawada News: మహా గౌరీ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం 8వ రోజు సోమవారం శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు మహా గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు పట్టణ పురవీధుల గుండా నంది వాహనంపై విహరించనున్నారు.

14:39 PM (IST)  •  03 Oct 2022

KCR on Mulayam Singh Yadav Health: ములాయం ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ఆరా, అఖిలేష్‌కు ఫోన్

అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత, ఎంపీ ములాయమ్ సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఆరా తీశారు. ములాయం సింగ్ కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు.

13:08 PM (IST)  •  03 Oct 2022

Adilabad Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ నిర్వహకుడి అరెస్ట్!

క్రికెట్ పోటీల షెడ్యూల్డ్ వచ్చిదంటే చాలు క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం కనపడుతుంది. అటు బెట్టింగ్ నిర్వహకులకు ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. గతంలోలాగా కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బెట్టింగులను నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో బ్రోకర్లుగా అవతారమెత్తిన వారంతా లాభపడుతుండగా, బెట్టింగ్ లు కాసిన వారి జేబులకు చిల్లు పడుతోంది.

తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్ విషయంలో పలువురు బెట్టింగ్ చేస్తుండగా, పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో పక్కా సమాచారంతో జిల్లా కేంద్రంలోని బొక్కలగూడలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 30 వేల నగదు, సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టుకున్న ఇమ్రాన్ ను సీసీఎస్ పోలీసులు ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బెట్టింగ్ లు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

12:23 PM (IST)  •  03 Oct 2022

శశిథరూర్ దళిత వ్యతిరేకి, ఆయనకు ఒక్క ఓటే వస్తుంది: కాంగ్రెస్ మాజీ ఎంపీ

కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని, మధ్యలో కొంత వెనుకబడ్డ ఇప్పుడు పుంజు కుంటుందన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింత మోహన్. 

50 ఏళ్ల తరవాత ఒక దళిత నేతను అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నాం.

మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాబోతున్నారు.

కొన్ని కార్పోరేట్ శక్తులు దీన్ని అడ్డుకుంటున్నాయి.

బీజేపీ వైపు నుండి  హైద్రాబాద్ లో శశిథరూర్ పర్యటన లో ఉన్నారు.

ఆయన ఎవరో నాకు తెలీదు.

ఆయన ఇప్పుడు నన్ను అధ్యక్షుడు గా చేయమని అడగడం మేము ఖండిస్తున్నాం.

ఖర్గే వివాద రహితుడు.

శశిథరూర్ పోటీ చేయావచ్చు కానీ ఆయనకు ఒక్క ఓటే వస్తుంది.

రాహుల్ గాంధీ జోడో యాత్ర జరుగుతుంది.

2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.

బీజేపీ కి వంద లోపు సీట్లు రావడం ఖాయం.

ఎందుకు కాంగ్రెస్ చతికిల పడింది అని చర్చించుకోవాలి....ఇందుకు పివి గురుంచి మాట్లాడుకోవాలి.

దేశం లో ఇంకా ఆహారం కోసం ఎదురుచూస్తుంది.

60 కోట్ల మంది దేశంలో ఆకలి తోనే నిద్ర పోతున్నారు.

8 చిరుత పులులు తీసుకొచ్చాడు.
మా కళ్ల ముందు వచ్చిన ఒక వ్యక్తి ని అపర కుబేరుడు అయ్యాడు.

ఇవి తప్ప బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎం లేదు.

 అప్పుడు పీవీ భు సంస్కరణలు చేసాడు.

కాంగ్రెస్ సరళీకృత నిర్ణయం వల్ల నష్టపోదా అని అడిగినప్పుడు...
నేను కిటికీ తెరిచాను..అటల్ బిహాట్ వాజపేయి డోర్ తెరిచాడు...మోడీ వచ్చి మొత్తం గోడలు కూల్చి పై కప్పు మాత్రమే మిగిల్చడు.

కాంగ్రెస్ కి లెఫ్ట్ పార్టీ లతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

 శశిథరూర్ ఒక దళిత వ్యతిరేక వ్యక్తి.

ఆయనకి కాంగ్రెస్ గురించి ఏమి తెలీదు.

ఆయన గెలవాడు..ఒక్క పర్సెంట్ కూడా ఓట్లు రావ్.

12:10 PM (IST)  •  03 Oct 2022

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదైంది. ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల కానుండగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయి. నామినేషన్ల దాఖలుకు గడువు 14తో యుగియనుంది. అక్టోబర్ 15 నామినేషన్ల పరిశీలన ముగియనుంది. నవంబర్ 3 న పోలింగ్ జరగగా.. నవంబర్ 6 న ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.

11:33 AM (IST)  •  03 Oct 2022

Kurnool News: పోలీసుల వేధింపులు తట్టుకోలేని కుటుంబం, అంతా కలిసి ఆత్మహత్యా యత్నం

కర్నూలు జిల్లా హోలగుంద మండలం కోత్తపేట గ్రామములో ఒకే కుటుంబానికి  చెందిన ముగ్గురు యువకులను సారా అమ్ముతున్నారనే నెపంతో పోలీసులు అరెస్టు చేశారు. తాము సారా అమ్మడం లేదని, సెబ్ పోలీసులు తమను విచారణ పేరుతో పిలిపించి తన భర్తపై కేసులు బనాయిస్తున్నారని వారు ఆవేదన చెందారు. పోలీసుల ఎదుటే పెట్రోలు, పురుగుల మందు తాగి ఆత్యహత్య ప్రయత్నం చేశారు. పోలీసులు మహిళలు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను, పెట్రోల్ సీసాను లాక్కోని కాపాడారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget