(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
‘‘ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వలన తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు లానినా దిశ ఉన్నా, ఇప్పుడు పరిస్ధితులు వెనక్కి మారనున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్ధితుల కంటే ఏప్రిల్ లో మరింత స్పష్టత రానుంది.
ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు ఉండటం సహజం. దానితో పాటు హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల వలన కూడ వర్షపాతం మారుతుంది. కానీ దాని ప్రభావం అత్యల్పంగానే ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(47) ( సైదాబాద్ లో నివాసముండే సోదరి కుమారుడు) గుండెపోటుతో మృతి చెందారు. సంతోష్ నగర్ డిఆర్డిఎల్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి కన్నుమూశారు.
బేగంపేటలోని బ్లైండ్ స్కూల్లో విషాదం, బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి
బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో విషాదం
బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి..
కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో కింద పడ్డ లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ..
ఆరో అంతస్తు నుంచి పడిపోయిన
12 సంవత్సరాల లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ..
యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను పరామర్శించిన భట్టి విక్రమార్క
సికింద్రాబాద్: తెలంగాణ లో అరాచక పాలన, అప్రజాస్వామిక వ్యవస్థ కొనసాగుతుందని కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు
వరంగల్ లో జరిగిన దాడి ఘటనలో గాయాలపాలై సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ను బట్టి విక్రమార్క పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..
భారాస నాయకులు గుండాల మాదిరిగా వ్యవహరిస్తూ దాడులకు దిగబడడం ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు గా మారిందన్నారు..
బారాస నాయకుల రాక్షసత్వం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని అనుమానం తలెత్తుతుందనీ అన్నారు..
వరంగల్లో పవన్ పై జరిగిన దాడి భాదాకరమని అన్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ శ్రేణులపై బారాస నాయకులు దాడులకు దిగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..
టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానం
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో కన్నాతో పాటు మరికొందరు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.
Osmania Dental Collage: ఉస్మానియాలో విద్యార్థుల ఆందోళన
ఉస్మానియా డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ వైఖరికి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహాలు ఖాళీ చేయాలంటూ యాజమాన్యం వేధిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు కాలపరిమితి పూర్తికాకుండానే హాస్టల్ ఎలా ఖాళీ చేస్తామని యూజీ, పీజీ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.