Breaking News Live Telugu Updates: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. నేడు (అక్టోబరు 20), రేపు ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అక్టోబరు 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడుతుందని చెప్పారు. చివరికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాల పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు.. అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగగా హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు. అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి ఉండొచ్చని తాజా వెదర్ బులెటిన్ లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అక్టోబరు 20 తెల్లవారుఝామున 3.30 గంటలకు విడుదల చేసిన నౌకాస్ట్ వార్నింగ్ ప్రకారం.. నేడు ఉదయాన్నే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీలో వాతావరణం ఇలా
అక్టోబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు, యానంలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దీనివల్ల వరి, అరటి పంటలకు కాస్త నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో జనం ఇళ్లలో ఉండాలని, చెట్ల కింద ఉండడం సరికాదని అధికారులు హెచ్చరించారు. ఎలక్ట్రిక్ పోల్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. విజయవాడలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈశాన్య రుతుపవనాలు కూడా ఓ కారణం - ఏపీ వెదర్ మ్యాన్
‘‘ఈశాన్య రుతుపవనాల వల్ల 20న తెల్లవారిజామున నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. ఈ వర్షాలు అన్ని చోట్లల్లో పడదు, కానీ కోస్తా భాగాల్లో మోస్తరు నుంచి భారీగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం వలన ఏర్పడిన గాలుల సంగమం వలనే ఈ వర్షాలు.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,550 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 50,780 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 61,500 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 46,550 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,780 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 61,500 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తదుపరి ప్రధానమంత్రి ఎన్నికయ్యే వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. ట్రస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది వారాల తరువాత, ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్వినియోగం పార్టీలో తిరుగుబాటును ప్రేరేపించింది. గత వారం రోజుల్లో ఇద్దరు మంత్రులు ఈ పదవికి రాజీనామా చేశారు
మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఎన్నికల బాధ్యత అప్పగించిన ఈసీ
మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగించింది ఎన్నికల కమిషన్. జగన్నాథరావు స్థానంలో రోహిత్ సింగ్ ను నియమించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై ఎన్నికల సంఘం వేటు వేసింది.





















