News
News
X

Breaking News Live Telugu Updates: కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్ లో  కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. రైల్లో బాంబు పెట్టామని అగంతకుడు పోలీసులకు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది.  

హౌసింగ్ బోర్డు ఆర్ అండ్ బీలో విలీనం, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం 

హౌసింగ్ బోర్డు, దిల్ సంస్థలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డును ఆర్ అండ్ బీ లో విలీనం చేసింది. హౌసింగ్ బోర్డు ఆస్తులు, సంస్థలు, ఉద్యోగులను ఆర్ అండ్ బీలో విలీనం చేసినట్లు తెలిపింది. 

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రపై ఏ స్పందనా లేదు - వర్ల రామయ్య
 • నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుమతులకు సంబంధించి నేటి వరకు ఎటువంటి స్పందన రాలేదంటూ డీజీపీకి రిమైండర్ పంపిన టీడీపీ నేత వర్ల రామయ్య
 • పాదయాత్ర తేదీ సమీపిస్తున్నప్పటికీ మీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదన్న వర్ల రామయ్య
 • జనవరి 27న మొదలు కానున్న పాదయాత్రకు త్వరగా అనుమతులు ఇవ్వాలని వినతి
 • అనుమతులు ఇస్తే అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని లేఖలో పేర్కొన్న వర్ల
 • పాదయాత్రకు సంబంధించిన సమాచారం కోసం టీడీపీ నేత బీద రవిచంద్ర, లోకేష్ పీఏ నరేష్ ను సంప్రదించవచ్చని కోరిన వర్ల
Warangal News: వరంగల్ లో బీజేవైఎం నేతల ఆందోళన

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలంటూ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Jagityal News: జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన

జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు శుక్రవారం తెల్లవారుజాము నుండి ఆందోళన చేపట్టారు. సంవత్సరం నుండి తమకు పెరిగిన జీతాలలో ఏరియర్స్ ఎమౌంట్ ను అధికారులు ఇవ్వడం లేదంటూ మున్సిపల్ కార్మికులు విధులు బంద్ చేసి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమకు ఏరియర్స్ బకాయిలు ఇచ్చేవరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Nagababu News: 21న, 22న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నాగబాబు పర్యటన

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ఈ నెల 21న కర్నూలు జిల్లా, 22 న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 21 శనివారం ఉదయం కర్నూలు జిల్లా వీర మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలో, మధ్యాహ్నం జన సైనికులకు ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు. 22 ఆదివారం అనంతపురం జిల్లా వీర మహిళలు, జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభలలో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

Secunderabad: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలం వద్దకు కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి
 • సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి
 • తరుచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
 • కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన కేంద్రమంత్రి
 • దట్టంగా అలుముకున్న పొగతో స్థానిక ప్రజల ఇబ్బందులు 
 • వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశం
 • బస్తీవాసుల యొగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి
 • అండగా ఉంటామని కిషన్ రెడ్డి హామీ
Telangana High Court: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు వివాదంలో విచారణ వాయిదా

తెలంగాణలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు వివాదంలో దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు జనవరి 27కు వాయిదా వేసింది. 

Cadapa Accident: కడప జిల్లా చాపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
 • కడప జిల్లా చాపాడులో ఘోర రోడ్డు ప్రమాదం
 • లారీని ఢీకొన్న టెంపో వాహనం
 • ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు
 • కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోనున్న చాపాడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘటన
 • తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుని కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో
 • మృతులు అనూష, ఓబులమ్మ, రామలక్ష్మిగా పోలీసులు గుర్తింపు
 • ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
 • మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
 • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చాపాడు పోలీసులు
Background

తెలుగు రాష్ట్రాలకు ఈ జనవరి చివరి వారంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వర్ష సూచన ఏర్పడుందని వివరించారు. ప్రస్తుతం శ్రీలంకను ఆనుకొని ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో వచ్చే 5 రోజులు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. 

విజయవాడలోనూ పొడి వాతావరణమే
పశ్చిమ గాలుల ప్రభావం బలపడుతుండడంతో పొడిగాలులు తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, కానీ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.

‘‘ఎప్పుడైనా చలి కాలం నుంచి ఎండా కాలం వెళ్లే కాలంలో కొన్ని వర్షాలు పడటం చాలా సహజం. గత పది సంవత్సరాల్లో ప్రతి సారి మనం జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఏదో ఒక నెలలో వర్షాలను చూశాము. ఈ సారి జనవరి చివరి వారంలో కొన్ని వర్షాలకు సంకేతాలు కనబడుతోంది. సాధారణంగా జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ మెల్లగా పగటి సమయంలో వేడి పెరుతుంది, అలాగే రాత్రి చల్లగా ఉంటుంది.

పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్‌ స్పెల్‌గా వ్యవహరిస్తారు.

రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఇప్పటిదాకా ఉత్తర తెలంగాణ జిల్లాలను వణికించిన చలి ఇక దక్షిణ జిల్లాలపై ప్రభావం చూపనుంది. మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల్లో నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.

హైదరాబాద్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.4 డిగ్రీలు, 17.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

టాప్ స్టోరీస్

YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం

YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ