Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Telangana Weather: తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Rains In Telangana: ఈ నెల 16 నుంచి తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు సహా నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్, జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (మార్చి 17) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. శనివారం (మార్చి 18) పెద్దపల్లి, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ములుగు, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వెదర్ బులెటిన్ లో తెలిపారు.
ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. 17, 18, 19 తేదీల్లో ప్రకాశం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Delhi Weather: ఢిల్లీలో ఇలా
రానున్న 5 రోజులపాటు భారత వాతావరణ విభాగం చెప్పిన అంచనాల ప్రకారం.. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చి 20 వరకు తేలికపాటి, మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండగా, వాయువ్య, తూర్పు, మధ్య, పశ్చిమ భారతదేశంలో మినహా గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన తేడా ఉండదు. మేఘావృతమైన వాతావరణం, వర్షం పడే అవకాశం ఉన్నందున ఢిల్లీ-NCR వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితాల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తి అవ్వగా... మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి 6584 ఓట్లు వచ్చాయని ఈసీ అధికారులు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏవీఎన్ రెడ్డికి 50 శాతానికి పైగా ఆధిక్యం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 12709.
కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితాల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తి అవ్వగా... మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి 6584 ఓట్లు వచ్చాయని ఈసీ అధికారులు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏవీఎన్ రెడ్డికి 50 శాతానికి పైగా ఆధిక్యం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 12709.
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో కవిత అనుమానితురాలు - కోర్టుతో చెప్పిన ఈడీ
కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు గైర్హాజరైన వ్యవహారంలో ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 20వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. అయితే, కవిత నేడు విచారణకు హాజరు కానందున రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఈ సందర్భంగానే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కోర్టుకు కీలక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె సాక్షా? అనుమానితురాలా? అని ఈడీ ప్రత్యేక కోర్టు ప్రశ్నించగా, అనుమానితురాలు అని ఈడీ కోర్టుకు చెప్పింది.
Vikarabad Rains: వికారాబాద్‌లో వడగండ్ల వాన, విదేశాన్ని తలపిస్తున్న రోడ్లు
వికారాబాద్ జిల్లా మర్పల్లిలో వడగండ్ల వాన కురిసింది. దీనివల్ల మంచు గడ్డలతో రోడ్లు నిండిపోయాయి. వడగండ్లు పడిన ఆ రోడ్లు చూస్తే విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతోంది. జహీరాబాద్‌లోనూ వడగండ్ల వాన పెద్ద ఎత్తున పడింది.