News
News
X

Breaking News Live Telugu Updates: బీజేపీలోకి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్! 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
బీజేపీలోకి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్! 

మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారు. కాసేపట్లో దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే తరుణ్ చుగ్, బండి సంజయ్ తో బూర నర్సయ్య గౌడ్ భేటీ అయ్యారు. 

 

RS Brothers IT Raids: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
 • రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
 • తెల్లవారుజాము నుండి 20 టీమ్స్ తో తనిఖీలు
 • హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు
 • సౌత్ ఇండియా, లాట్ మొబైల్స్ లో సోదాలు
 • మూడు వ్యాపార సంస్థలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులపై ఆరా
 • ఇటీవల కాలంలో ఆయా సంస్థలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఐటీ శాఖ
Warangal News: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో త్రాచుపాము కలకలం

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో త్రాచుపాము కలకలం రేగింది. హాస్పిటల్ లోని ఫీవర్ వార్డులోకి పాము రావడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుని బయట వదిలిపెట్టారు. గతంలో ఇదే ఆస్పత్రిలో ఎలుకలు కొరికడం వల్ల ఓ రోగి మృతి చెందిన ఘటన తెలిసిందే.

TDP Leader Arrest: ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
 • వైస్సార్ కడపజిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
 • ఈ రోజు తెల్లవారుజామున ఒంటిగంటకు తన నివాసంలో ఉండగా అరెస్ట్ చేసిన పోలీసులు
 • అరెస్ట్ చేసి ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు
 • అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలింపు
 • ఇంచార్జ్ తో పాటు మరో 5 మంది అనుచరులు అరెస్ట్
Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

రేపు పెరటాసి నెల చివరి శనివారం కావడంతో పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు

శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,216 మంది భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 5.65 కోట్లు

IT Raids: హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
 • హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
 • పది చోట్ల ఐటీ తనిఖీలు
 • మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు మరో రెండు చోట్ల సోదాలు
 • పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు
 • దాదాపు పది బృందాలతో కొనసాగుతున్న సోదాలు
 • హనర్స్, సుమధుర, ఆర్ ఎస్ బ్రదర్స్ కంపెనీలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు
IT Raids in RS Brothers: ఆర్ఎస్ బ్రదర్స్ సహా వివిధ కంపెనీల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ శాఖల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్, జూబ్లీహిల్స్ సహా ఏకంగా 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Background

తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కరవు సీమ అయిన అనంతపురం వరదల్లో చిక్కుకోగా, మిగతా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కనిపించింది. ఈ నెల 15 వరకూ తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితి
మధ్య బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం రానున్న రెండు రోజుల్లో బలహీనపడుతుంది. తరువాత ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు (అక్టోబరు 14) ఉదయం 6 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు ఉంటాయని అధికారులు ప్రకటించారు. 

సాధారణ వెదర్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాలు ఇవీ..
14, 15 తేదీల్లో మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. ఉరుములు, మెరుపులు కూడా చాలా జిల్లాల్లో అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రాయలసీమలో అధికంగా వర్షాలు
ఏపీలో రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తా ఆంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొద్దిచోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రెండు రోజుల్లో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా అధికారులను హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో వెంటనే కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. వర్షాలతోపాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

‘‘ఉపరితల ఆవర్తనం వల్ల ఈ రోజు (అక్టోబరు 14) తెల్లవారుజాము వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ​పట్నం, అనకాపల్లి, కాకినాడ​, కొనసీమ​, ఎన్.టీ.ఆర్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ కొద్ది సేపు వర్షాలుంటాయి. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ఏర్పడుతున్న భారీ మేఘాల వల్ల​, అలాగే పీడనం బలపడటం వలన మరో రెండు గంటల్లో నంధ్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడనుంది. అలాగే నేడు తెల్లవారిజామున సమయంలో అక్కడక్కడ భారీ వర్షాలు, పిడుగులు ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే