అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఏపీ మంత్రి రోజా ఇంటి ముందు ఉద్రిక్తత..

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ఏపీ మంత్రి రోజా ఇంటి ముందు ఉద్రిక్తత..

Background

దక్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 

ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.

కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 2 - 4 డిగ్రీలు: ఐఎండీ
తెలంగాణలో చలి నేడు రేపు 2 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నేడు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.

ఇక మహబూబ్ నగర్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కడ 37 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 10.2 డిగ్రీలు నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేశారు.


‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.

ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ​, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

19:46 PM (IST)  •  14 Feb 2023

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఇంటి ముందు ఉద్రిక్తత..

తిరుపతి : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఇంటి ముందు ఉద్రిక్తత..

ఏపి మంత్రి ఆర్.కే.రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో చీర, గాజులుతో రోజా ఇంటిలోని ముట్టడించేందుకు టిడిపి మహిళలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు.. అయితే విషయం తెలుసుకున్న నగిరి పోలీసులు మహిళలను, నాయకులను, కార్యకర్తలను మంత్రి రోజా ఇంటికి వెళ్ళకుండా బ్యారీ గేట్లు వేసి అడ్డుకున్నారు.. దీంతో ఒక్కసారిగా రోజా ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొంది.. పోలీసుల తీరుపై ఆగ్రహించిన తెలుగు మహిళలు, పోలీసులతో వాగ్వాదంకు దిగ్గారు.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తెలుగు మహిళలు రోజా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.. అయితే తెలుగు మహిళలను, టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేశారు.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పోలీసు స్టేషను నిండి పోయింది.. ఏపి మంత్రి రోజా కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు అడ్డంగా బైటాయించి తెలుగు తమ్ములు తమ నిరసనను వ్యక్తం చేశారు..

19:41 PM (IST)  •  14 Feb 2023

టీచర్ల బదిలీలపై టీఎస్ హైకోర్టు స్టే 

తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఇచ్చింది. మార్చి 14 వరకు బదిలీల చేపట్టవద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాన్ స్పౌజ్ టీచర్ల బదిలీలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  

15:21 PM (IST)  •  14 Feb 2023

3 రోజులపాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

రేపటి (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  పర్యటించనున్నారు.

13:28 PM (IST)  •  14 Feb 2023

PM Modi Telangana Tour: తెలంగాణలో మార్చి చివరి వారంలో ప్రధాని మోదీ పర్యటన

  • రాష్ట్రంలో మార్చి చివరి వారంలో ప్రధాని మోదీ పర్యటన
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో మోదీ పర్యటన
  • తెలంగాణలో ప్రధాని పర్యటనను ధ్రువీకరించిన బీజేపీ వర్గాలు
  • పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని
12:46 PM (IST)  •  14 Feb 2023

IT Raids on BBC: ఢిల్లీ బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. కార్యాలయంలో ఉన్న వ్యక్తుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget