By : ABP Desam | Updated: 11 Dec 2022 06:53 PM (IST)
దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. సుమారు ఏడున్నర గంటలకు పైగా సీబీఐ అధికారులు ఆమెను విచారించారు. ఈ కేసులో కవిత వివరణను కేవలం సాక్షిగా మాత్రమే నమోదు చేశారు.
హైదరాబాద్: వైఎస్ షర్మిల అరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు
-11 వ తేదీన తెల్లవారుజామున ఒంటి గంటకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు
- లో బీపి , బలహీనత, మైకము ఉండటం తో అడ్మిట్ అయ్యారు.
- ఆమెకు డీహైడ్రేషన్,ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉంది.
- ఆమెకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ మరియు ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యలు తెలిపారు.
- ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది
-ఈరోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం
- ఆమె 2-3 వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఉడిపి బండారు కెరీ మఠం పీఠాధిపతి విద్యదీస్య తీర్థ స్వామిజి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికర్జిన్, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ బృందం ఆదివారం కవిత ఇంటికి చేరుకుంది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం సమావేశం కావడానికి సీబీఐ అధికారులకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కళకళలాడే కవిత నివాస ప్రాంగణం ప్రస్తుతం ఖాళీగా మారింది. రాజకీయ కక్షలో భాగంగానే సీబీఐ అధికారులు వస్తున్నారని, కవిత మాత్రం ఎటువంటి బలప్రదర్శన లేకుండా సాదాసీదాగా కవిత వ్యవహహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మాండస్ తుపాను తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా మారి.. ఆ తర్వాత శనివారం (డిసెంబరు 10) సాయంత్రానికి అల్ప పీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ అధికారులు అంచనా వేశారు. రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురవవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్ శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన సంగతి తెలిసిందే.
‘‘మోస్తరు నుంచి భారీ వర్షాలు గుంటూరు, కొనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు ఉదయం వరకు కొనసాగనున్నాయి. అలాగే విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం జిల్లాతో పాటుగా తూర్పు తెలంగాణ భాగాలైన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నేడు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఈ మాండోస్ తుఫాను ప్రభావం అసలు నేడు కూడా తగ్గే లాగా లేదు. గతంలో చెప్పిన విధంగా ఈ మాండోస్ తుఫాను ప్రభావం డిసెంబరు 13 వరకు కొనసాగనుంది. నిన్న తెల్లవారిజామున నుంచి రాయలసీమ లోపల భాగాలైన అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు పశ్చిమ ప్రాంతాలు, కడప జిల్లాల్లో విస్తారంగా పడ్డాయి. అలాగే డిసెంబరులో వచ్చిన తుపాను కాబట్టి చలి తీవ్రత కూడా తారా స్ధాయిలో ఉంది. నేడు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండనుంది. కొన్ని వాగులు వంకలు అనంతపురం జిల్లాలో పొంగే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోగలరు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తుపాను ప్రభావం తెలంగాణపై చాలా స్వల్పంగా ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్‌లో వాతావరణం ముసురు పట్టి ఉంటుంది. నగరంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,440 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,000 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,900 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,440 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 73,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!