అన్వేషించండి

Breaking News Live Updates: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం, అవస్థలు పడుతున్న బాలింతలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Updates: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం, అవస్థలు పడుతున్న బాలింతలు 

Background

నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డి పాలెం పాత మిట్ట ప్రాంతంలో దారుణం జరిగింది. నవకోటి అజయ్, రాయపు కార్తీక్ లపై కత్తులతో ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని స్థానికులు ఓ ఇంటిలో బంధించారు. తీవ్ర గాయాలపాలైన నవకోటి అజయ్, రాయపు కార్తీక్ లను హాస్పిటల్ కి తరలించారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని, నిందితులను నెల్లూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ పలుమార్లు ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డారు. వినాయక చవితి వేడుకలలో మొదలైన ఇరువర్గాల మద్య వివాదం మొదలైంది. గతంలో పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగినప్పటికీ న్యాయం జరగలేదంటూ స్థానికులు వాపోతున్నారు.

దక్షిణ అండమాన్‌, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారి, ఆపై తుపానుగా రూపం దాల్చింది. అసని తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతానికి దగ్గర్లో, పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమ, ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రమంగా వాయువ్యంగా కదులుతూ మే 10 రాత్రికి ఉత్తరకోస్తాంధ్ర, ఒడిశా తీరానికి సమీపానికి చేరనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం, తుపాను (Cyclone Asani) ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు (Light to Moderate Rain or Thundershowers) కురవనున్నాయి. తుపాను కారణంగా వాతావరణ శాఖ ఏపీలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఏపీలో చల్లచల్లగా.. వర్షాలే వర్షాలు
అల్పపీడనం, అసని తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మే 12 వరకు వర్ష సూచన ఉండగా.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముంద్రంలో చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు సూచించారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
అసని తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. మరో మూడు రోజులపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గనుందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా తుపానుకు అసని పేరును శ్రీలంక దేశం సూచించింది. సింహళం భాషలో అసని అంటే ప్రకోపం అని, ప్రతీకారం లేదా శిక్షించడం అనే అర్థం వస్తుంది.

తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు..
తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వానల నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. రాగల 12 గంటల్లో అసని తుఫాను మరింత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది.

22:14 PM (IST)  •  09 May 2022

తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం, అవస్థలు పడుతున్న బాలింతలు 

తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పండి. ఆస్పత్రిలోని తల్లి పిల్లల విభాగంలో మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోతతో బాలింతలు, పసికందులు ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక సమస్య తలెత్తిందని వైద్యాధికారులు అంటున్నారు. విషయం తెలుసుకుని రాత్రి 8 గంటల సమయంలో సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సందర్శించారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. 

16:27 PM (IST)  •  09 May 2022

Nellore News: నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం- ప్రేమించలేదని యువతిని గన్‌తో కాల్చిన యువకుడు

నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలం తాటిపర్తిలో దారుణం జరిగింది.  ప్రేమించలేదని యువతిని గన్‌తో కాల్చి చంపిన యువకుడు. 
అనంతరం తానను తాను కాల్చుకున్న యువకుడు. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని దారుణానికి ఒడిగట్టాడు యువకుడు.  

14:56 PM (IST)  •  09 May 2022

Pawan Kalyan: కామారెడ్డి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోవడం బాధాకరం

Kamareddy Road Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా హసన్ పల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోవడం బాధాకరం అన్నారు జనసేన అధ్యక్షు పవన్ కళ్యాణ్. బంధువుల దశదినకర్మకు వెళ్లొస్తుండగా ఇలాంటి ఘటన జరగడం కలచివేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

13:12 PM (IST)  •  09 May 2022

Exgratia For Kamareddy Accident Victims: కామారెడ్డి ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Exgratia For Kamareddy Accident Victims: కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.  మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది.

11:14 AM (IST)  •  09 May 2022

Hyderabad Task Force Raids: పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ దాడులు - పోలీసుల అదుపులో 59 మంది

Hyderabad Task Force Raids: హైదరాబాద్ : నగరంలోని పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. గేమ్స్ పేరుతో రోడ్లపై యువత హంగామా చేస్తున్నారనన్న సమాచారంతో రాత్రి 1 నుండి 3 వరకు పోలీసుల దాడులు చేశారు. స్నూకర్ పార్లర్స్ పై మూకుమ్మడి తనిఖీలు చేసిన పోలీసులు మీర్ చౌక్ లో 21, మొఘల్ పురలో 27, భవాని నగర్లో 11 మందిని.. మొత్తం 59 మంది అదుపులోకి తీసుకున్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget