Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
కోనసీమ జిల్లా పేరు మార్చడంపై చిన్నాగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత మంత్రి ఇంటిని ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి దూసుకెళ్లారు.
కలెక్టరేట్ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగకా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది.
ఆందోళన వద్దని పోలీసులు వేడుకుంటున్నా.. ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఓ దశలో లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం భయపడలేదు. లాఠీ దెబ్బలతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు కాస్త ఆందోళకరంగా సాగిన ముట్టడి రక్తసిక్తమైంది.
కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఉద్యమం చేస్తున్న నిరసనకారుల దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసిన అనంతరం కలెక్టరేట్ పక్కనే ఉన్న బస్సులు, వాహనాలను టార్గెట్‌గా చేసుకున్నారు ఆందోళనకారులు. ఓ ప్రైవేటు కాలేజీ బస్సులను దహనం చేశారు. అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇలా దొరికిన వాటిని ధ్వంసం చేస్తూ వెళ్లిపోయారు.
అయినా ఆగ్రహం చల్లారని ఆందోళనకారులు అమలాపురంలో ఉన్న మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈలోపే ఆందోళనకారులు ఆ ఇంటిని చుట్టు ముట్టి నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇంటి ఆవరణంలో ఉన్న ఫర్నీచర్ దహనమైంది. అక్కడే నిలిపి ఉంచిన మూడు కార్లను ధ్వంసం చేశారు. అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్‌పై కూడా దారి చేశారు.
అదే ఊపులో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి కూడా ఆందోళనకారులు దాడికి వెళ్లారు. ఆయన ఇంటికి కూడా నిప్పు పెట్టారు. అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడి జరిగే సమయంలో ఆయన ఇంట్లో ఎవరూ లేరు. ఆందోళనకారుల ఎత్తులను పసిగట్టిన పోలీసులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌తోపాటు ఫ్యామిలీ మెంబర్స్‌ను సురక్షితంగా రాజమండ్రి తరలించారు.
ఇంత విధ్వంసం జరిగినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. వేలమంది యువకులు రోడ్లపైనే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను తరలించారు. అమలాపురంలోని ఆందోళనజరుగుతున్న ప్రాంతంలో ఇళ్లను ఖాళీ చేపిస్తున్నారు.
Amalapuram Live: కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఉద్యమం
Konaseema District: ఆ పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదు- మార్చే ఉద్దేశం లేదు: సజ్జల
కోనసీమలో జరుగుతున్న దాడిపై ప్రభుత్వం రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. జిల్లా పేరు మార్చే ఉద్దేశం లేదన్న ఆయన... డిమాండ్స్ ఏంటో చెప్పాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాల కుట్ర చేస్తున్నట్టు అర్థమవుతుందని అభిప్రాయపడ్డారాయన.
CCS Row In AP: సీపీఎస్ పునరుద్ధరణ సాధ్యం కాదు, జీపీఎస్‌కు సహకరించండి: ఉద్యోగులకు ప్రభుత్వం సూచన
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసాయి.. పాత పింఛన్ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ తెగేసి చెప్పేసింది. న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడ మంత్రులు వెల్లడించారు. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు నచ్చజెప్పాలని ఉద్యోగ నేతలకు మంత్రులు సూచించారు.
జీపీఎస్ పై తమ అభిప్రాయాలు గురించి,6 సంఘాల నేతలు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. జీపీఎస్‌లో సీపీఎస్‌లోని అవలక్షణాలన్నీ ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి. జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో 4 లక్షల ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తెచ్చారని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్‌లో పెట్టిన డబ్బులు రావని ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. దీని పై కూడా ఉద్యోగులు అసంతృప్తినివ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఆ మొత్తం ఉద్యోగులదేనని ఉద్యోగ సంఘాలు కూడ దీటుగానే స్పష్టం చేశాయి. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని కూడ ఉద్యోగ సంఘాలు వివరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. వాటిని కనీసం పట్టించుకొని మంత్రుల కమిటి జీపీఎస్ పైనే మాట్లాడాలని ఉద్యోగులకు సూచించారు.అంతే కాదు జీపీఎస్ లో ఇంకా ఏం కావాలో మాత్రమే చెప్పాలని క్లారిటి అడిగింది, మంత్రుల కమిటీ
Kamareddy: కాంగ్రెస్ రచ్చబండలో రచ్చ రచ్చ
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు బజారుకెక్కాయి. ఇప్పటికే ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఇద్దరు నేతలకు సంబంధించిన వర్గీయులు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఒకేచోట తారసపడటంతో.. మాటామాటా పెరిగి బాహాబాహీకి దిగారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ సుభాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ విభేదాలు కాస్త ఇవాళ బజారుకెక్కి ఘర్షణకు దారితీశాయి. లింగంపేట్ మండలం కోమట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాయకులు మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణతో కోమట్ పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను పంపించేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు లింగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
Punjab Health Minister: కేబినెట్ నుంచి పంజాబ్ ఆరోగ్య మంత్రికి ఉద్వాసన
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిపై కన్నెర్ర చేశారు. ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో భగవంత్ మాన్ సింగ్ ఆయనకు ఉద్వాసన పలికారు. కాంట్రాక్టుల విషయంలో విజయ్ సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు స్పష్టమైన ఆధారాలు సేకరించిన మీదట ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లుగా పంజాబ్ సీఎంవో వెల్లడించింది.