అన్వేషించండి

Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

Background

ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కొనసాగనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఈ నెల 19 వరకూ ఏపీకి వర్ష సూచన ఉంది. నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పారు. 

దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పారు. రాయలసీమలోనూ నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంటుంది.

ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మే 16న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయని హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడా క్రమంగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరుగుతుందని అంచనా వేసింది.

‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీల సెంటీ గ్రేడ్ నుంచి 24 డిగ్రీల సెంటీ గ్రేడ్ వరకూ ఉండే అవకాశం ఉంది. దక్షిణ నైరుతి దిశ ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది.’’ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.

‘‘భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. నిన్న పది గ్రాములకు రూ.200 తగ్గింది. ఇవాళ అదే ధర కొనసాగుతోంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. 

తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,450గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.63,700 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.63,700గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,450గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.63,700 గా ఉంది.

20:46 PM (IST)  •  16 May 2022

మహిళలు పై దాడులు నిరసిస్తూ విశాఖలో టీడీపీ మహిళల నిరసన

రాష్ట్రంలో మహిళలు పై దాడులు నిరసిస్తూ విశాఖ టిడిపి కార్యాలయం వద్ద తెలుగు మహిళా కొవ్వొతులతో నిరసన తెలిపారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. ఈ మూడేళ్ళలో మహిళలు మీద దాడులు పెరిగాయి. ఇన్ని దాడులు జరుగుతుంటే ఇంటిలో పబ్జి అడుకుంటున్న సీఎం ని చూడలేదు. ఆరేళ్ల ఆడ బిడ్డ మీద దాడి జరిగితే  వక్ర మార్గంలో చూస్తున్నారు.

బయటకు రావడం కాదు ఇంటిలో ఉంటే దాడులు చేస్తున్నారు. మీడియా సంస్థలను తిట్టడం తప్ప సీఎం పరిపాలన కోసం ఆలోచించడం లేదు. గన్ కన్నా ముందు జగన్ వస్తాడో లేదే తెలియదు కాని రాష్ట్రానికి గన్ కల్చర్ వచ్చింది. పోలీసులు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆడవారి మానాలకు, ప్రాణాలకు రేట్ కడుతున్న సీఎం జగన్ కి పాలన చేతకాక పోతే ఆ పదవి నుంచి దిగిపోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.

19:52 PM (IST)  •  16 May 2022

Actress Karate Kalyani: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

చిన్నారుల దత్తత విషయంలో ఫిర్యాదు అందడంతో అధికారులు నటి కరాటే కళ్యాణి ఇంట్లో తనిఖీలు చేయగా ఆమె ఎక్కడికో వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని సైతం నోటీసులు ఇవ్వగా, అందుకు ఆమె హాజరు కాలేదు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని, పూర్తి ఆధారాలతో మీడియా ముందు నేటి రాత్రి 8.30 గంటలకు వస్తానని చెప్పారు. అమీర్‌పేట లోని కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో మీడియాతో మాట్లాడతానని నటి వెల్లడించారు.

15:36 PM (IST)  •  16 May 2022

Bank Of Baroda: బ్యాంకులో అవకతవకలు జరిగాయి, కానీ నేను నిర్దోషిని: క్యాషియర్ ప్రవీణ్

తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని నిందితుడు క్యాషియర్ ప్రవీణ్ చెబుతున్నాడు. వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు లో ఉన్న లోపాలను కప్పి పుచ్చుకునేందకు తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అవకతవకలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతానని క్యాషియర్ ప్రవీణ్ పేర్కొన్నాడు.

15:33 PM (IST)  •  16 May 2022

AP News: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కలిసిన సత్యంబాబు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను సత్యంబాబు కలిశారు. ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన తనకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదని కలెక్టర్‌కు విన్నవించారు. పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావును సత్యంబాబు కోరారు.

13:03 PM (IST)  •  16 May 2022

Etcherla: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీMohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
7G The Dark Story OTT Telugu: ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mushtaq Khan Kidnapped: కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Embed widget