Breaking News Live: చిల్లేపల్లిలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కారు అద్దాలు ధ్వంసం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
విభజన హామీలపై సీఎం జగన్ కీలక ఉపన్యాసం
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం జగన్ అన్నారు. విభజన జరిగి ఏడేళ్లైనా హామీలు ఇప్పటి వరకూ అమలుకాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి విద్యుత్ బాకీలు రాలేదన్న సీఎం.. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు పూర్తికాలేదన్నారు. విద్యుత్ రుణాల్లో కోత విధిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారించాలని సీఎం జగన్ కోరారు. దీని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్.. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.
పసిడి, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.1 పెరగ్గా.. వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో గ్రాముకు రూ.1 పెరిగి.. రూ.46,110 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,190 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇంధన ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగింది. దీంతో తాజా ధర రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కప్ గెల్చిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా 14 సంవత్సరాల కల ఎట్టకేలకు నెరవేరింది. పొట్టి ఫార్మాట్‌లో మొట్టమొదటిసారి విశ్వవిజేతగా నిలిచింది. 2007లో మొదటి టీ20 వరల్డ్ కప్ జరిగినప్పటి నుంచి ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. వారి ప్రయత్నం ఎట్టకేలకు ఈ వరల్డ్‌కప్‌లో ఫలించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటిసారి ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
పూర్వ విద్యార్థుల సమావేశంలో అశ్లీల నృత్యాలు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లమల్ల రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు సమావేశంలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. కార్తీక వనభోజనాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జాతర్లు పేరు ఏదైనా రాజకీయ అండ పోలీసులు దన్ను ఉండడంతో అశ్లీల ప్రదర్శనలు సర్వ సాధారణమైపోయింది. అనపర్తిలో నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. నల్లమిల్లి రామారెడ్డి( నేషనల్ ) తోటలో అశ్లీల ప్రదర్శనలు బహిరంగంగా నిర్వహించడం నిర్వాహకుల తీరును పలువురు తప్పుబడుతున్నారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
చిల్లేపల్లిలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కారు అద్దాలు ధ్వంసం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సూర్యపేట జిల్లా చిల్లేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది.





















