అన్వేషించండి

Breaking News Live: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్... విద్యాశాఖ సంచలన నిర్ణయం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్... విద్యాశాఖ సంచలన నిర్ణయం 

Background

నడిరోడ్డుపై నెలలు నిండని పిండం
హైదరాబాద్‌లో నెలలు నిండని పిండం అల్వాల్ సమీపంలోని అంజనాపురి కాలనీ వీధిలో కనిపించడం కలకలం సృష్టించింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్‌లోని అంజనాపురి కాలనీ వీధిలో ఉదయం సుమారు 4 నెలల వయసున్న పిండం రోడ్డుపై పడి ఉంది. కుక్కలు పీక్కుతింటుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పంచనామా చేసిన అనంతరం పోలీసులు స్థానికంగా ఓ నిర్జీవ ప్రదేశంలో పిండాన్ని పాతిపెట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా వారికి ఎలాంటి సమాచారమూ లభించలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో దొంగలు
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లలోని ల్యాప్‌టా‌ప్‌లను దొంగిలించే ఓ ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ, బోయిన్‌ వెంకటేశం, అజ్జంపల్లి గోవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తులు కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో ఉంటూ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. కొద్దిరోజులుగా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించేవారు. ఇళ్లలోని కిటికీలు, తలుపుల వద్ద అందుబాటులో ఉన్న వాటిని దొంగిలించేవారు. తాజాగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

వాతావరణం
చలి గాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుంది. ఓ వైపు తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉత్తర, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తక్కువా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో కనిష్టం 6 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొనసీమ ప్రాంతాలైన అమలాపురం, రాజోలులో..  గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోనూ పొగ మంచు దట్టంగా కురవడంతో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఉదయం వేళ ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. నెల్లూరు జిల్లాలో కూడ పొగ మంచు కురవనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి చలి గాలులు వీస్తున్నాయి కనుక చల్లదనం ఎక్కువై ఉష్ణోగ్రతలు భారీ పడిపోతాయి. మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న గాలులతో ప్రజలకు చలి మరింత ఎక్కువ కానుందని సూచించారు.

పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో కూడా నేడు (డిసెంబరు 24)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే ఉంటోంది. కొద్ది రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.24 పైసలు పెరిగి రూ.109.93 గా ఉంది. డీజిల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.96.23 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.06 పైసలు తగ్గి రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు తగ్గి రూ.96.36గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.70 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18 గా ఉంది. ఇది రూ.0.65 పైసలు తగ్గింది.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. గ్రాముకు రూ.20 వరకూ తగ్గి పది గ్రాములకు రూ.200 వరకూ తేడా కనిపించింది. ముందు రోజు గ్రాముకు రూ.15 తగ్గిన సంగతి తెలిసిందే. వెండి ధర కిలోకు రూ.0.40 పైసలు పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,350 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,480 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,200గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,350 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,480గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,200గా ఉంది.

18:33 PM (IST)  •  24 Dec 2021

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ 

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తునట్లు ప్రకటించింది. ఇటీవల ఫలితాల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కనీస మార్కులతో పాస్ చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.  

18:10 PM (IST)  •  24 Dec 2021

కేబీహెచ్బీ కాలనీలో విషాదం... సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి 

హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుకట్ పల్లి హౌస్సింగ్ బోర్డు కాలనీలో ఓ ఆపార్ట్ మెంట్ సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. కేపీహెచ్బీ 4వ ఫేజ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

14:53 PM (IST)  •  24 Dec 2021

జిల్లా థియేటర్లలో కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు

కర్నూలు జిల్లాలో థియేటర్లలో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. థియేటర్లలో ప్రేక్షకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీసారు. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగానే థియేటర్లలో ప్రమాణాలు చెక్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. థియేటర్లలో ధరలు, సౌకర్యాలు వివరాలు ఆరాతీస్తున్నారు.

14:51 PM (IST)  •  24 Dec 2021

మధ్యాహ్న భోజనం ఎత్తివేసి పేదలకు విద్యను దూరం చేసే కుట్ర.. మల్లు రవి ఆరోపణలు

మధ్యాహ్న భోజనం ఎత్తివేసి పేదలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మల్లు రవి విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు ఏంతో ఉపయోగకరంగా ఉండి, పాఠశాలలో పేద విద్యార్థులను చేర్పించేందుకు అవకాశాలు ఉండేవన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి నిధులు విడుదల  చేయకుండా నిలిపి వేసిందని, దీంతో నిధుల కొరత ఏర్పడి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయిందని చెప్పారు.

12:41 PM (IST)  •  24 Dec 2021

తుళ్లూరు పోలీసులపై మంగళగిరి కోర్టు జడ్జి ఆగ్రహం.. పోలీసులపై చర్యలకు ఆదేశం

గుంటూరు: తుళ్లూరు పోలీసులపై మంగళగిరి కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ దుర్గాప్రసాద్ సహా పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశించారు. ఓ కేసులో రాత్రి 8 మందిని జడ్జి ఎదుట- పోలీసులు హాజరుపరిచారు. తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని జడ్జి ఎదుట నిందితులు వాపోయారు. వైద్య పరీక్షల కోసం వారిని న్యాయమూర్తి జీజీహెచ్‍కు పంపాలని సూచించారు. నిందితులకు గాయాలు ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. 8 మంది నిందితుల రిమాండ్ రద్దు చేసి విడుదల చేయాలని మంగళగిరి కోర్టు జడ్జి ఆదేశించారు. నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Embed widget