Congress Manifesto: ఈ 6న తుక్కుగూడ సభలోనే ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల: రేవంత్ రెడ్డి
Telangana Congress Meeting: ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభ (Tukkuguda Meeting)లో ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Congress Jana Jatara Meeting at Tukkuguda on April 6- హైదరాబాద్: చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి, వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు రైతుల ఆత్మహత్యలు, సమస్యలపై చేస్తున్న కామెంట్లపై రేవంత్ స్పందించారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్ కు 48 గంటల సమయం ఇస్తున్నాను, రైతుల పూర్తి వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. పంటలు ఎండిపోక ముందే కేసీఆర్ జరగనున్న విషయం మాకు చెప్పొచ్చు కదా, ఎండిపోయిన తరువాత మంటల దగ్గర కేసీఆర్ చలి కాచుకుందాం అనుకుంటున్నాడు అని విమర్శించారు.
తుక్కుగూడ సభలో మ్యానిఫెస్టో విడుదల
ఈనెల 6 తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ (Tukkuguda Meeting) నిర్వహించనుంది. ఆ సభలోనే ఏఐసీసీ మ్యానిఫెస్టో ( Congress Manifesto) విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభకు హాజరవుతారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే... రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ పదేళ్ళ లో వందేళ్ల విధ్వంసం జరిగింది. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ లను ఓక్కోక్కటి అమలు చేస్తూ వస్తున్నాం. ఎన్నికల కోడ్ తర్వాత మిగతా హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ కు తెలంగాణ కంచుకోట అని లోక్‌సభ ఎన్నికల్లోనూ నిరూపిస్తాం. సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తాం’ అన్నారు.
కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు రైతుల ముఖం చూడని కేసీఆర్.. 10 సంవత్సరాల తర్వాత అయినా బీఆర్ఎస్ అధినేత పొలం బాట పట్టినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అధికారం కోల్పోయినందుకు, కూతురు జైలుకు పోయినందుకు కేసీఆర్ పై జాలి కలుగుతోందన్నారు. కేసీఆర్ కు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదా.. కేసీఆర్ పాపాలకే ఈ కరువు అని.. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 65 లక్షల రైతుల ఖాతాలో రైతు బంధు వేసింది. ఇక మిగిలింది 4 లక్షల రైతులే. కావాలని జనరేటర్ తో ప్రెస్ మీట్ పెట్టి... విద్యుత్ పోయిందని మా ప్రభుత్వంపై నిందలు వేశారు. బీఆర్ఎస్ పదేళ్ళ ప్రభుత్వం లో మేము ఏదైనా కార్యక్రమం కు పిలుపునిస్తే మమ్మల్ని అరెస్ట్ లు చేశారు. మేం మాత్రం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశాం. మేం తలుచుకుంటే కేసీఆర్ బయటకు వెల్లే వాడివా. బీఆర్ఎస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి.. రైతు లకు ఓ 100 కోట్లు సహాయం చేయవచ్చు కదా అని రేవంత్ రెడ్డి సూచించారు.
కేసీఆర్ న్యాయమైన సూచనలు ఇస్తే అమలు చేస్తాం. ధాన్యం కొనుగోలు కు ఏర్పాటు చేశాం. మేము ఢిల్లీ వెల్లిన ప్రతీ సారి రాష్ట్ర హక్కులు సాధిస్తున్నాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారు.. అందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటు. జూన్ 9 న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎన్నికల కోడ్ లో కొత్తవి అమలు చేయరాదు. - రేవంత్ రెడ్డి
కాళేశ్వరం లో అన్ని బొక్కలే ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమని కేసీఆర్ ను, బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత త్రాగు నీరు.. పొదుపు గా నీరు వాడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కు 40 వస్తే అంటే.. మోదీకి 400 అని కేటీఆర్ ఓప్పుకున్నట్లేనా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలకు అర్థమైందన్నారు.