అన్వేషించండి

Adilabad News: ఆదిలాబాద్‌లో బోడ కాకరకి భలే డిమాండ్, దీంతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు

Telangana News: అదిలాబాద్ జిల్లాలో బోడ కాకర కాయలు సహజంగా లభిస్తాయి. ప్రస్తుతం వర్షాకాలం అటవీ ప్రాంతాల్లో ఈ బోడ కాకరలు సహజంగానే దొరుకుతున్నాయి.

Telugu News: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, బేల, తలమడుగు, తాంసి, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు అటవీ ప్రాంతాల్లో అటూ కవ్వాల్ అభయారణ్యం అటవీ ప్రాంతాల్లో బోడ కాకర కాయలు ఎక్కువగా దొరుకుతాయి. కేవలం అటవీ ప్రాంతంలోనే కాదు దట్టమైన పొదల్లో, చెట్లకు అల్లుకొని ఉన్న తీగల్లో ఈ బోడ కాకరకాయ పెరుగుతుంది. జూలై నుండి ఆగస్టు నెల వరకు మాత్రమే ఇవి కాస్తాయి. బోడ కాకర కాయలు సహజంగా లభిస్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో బోడ కాకరలు ఎక్కువగా దొరుకుతున్నాయి. 

ఔషధ గుణాలు
గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు అడవుల్లో సేకరించి, స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు. పావు కిలో 40 రూపాయల నుంచి నుంచి 50 రూపాయల వరకు ధర పలుకుతోంది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిలో 200 రూపాయలు పలుకుతోంది. నేరడిగొండ, నిర్మల్, మంచిర్యాలలో ధర 400 కిలో పలుకుతోంది. వర్షాకాలం సీజన్ లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు మార్కెట్లో ప్రస్తుతం కొండెక్కాయి. వానాకాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్లు చెబుతుంటారు. చాలామంది శ్రావణమాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ఇంటికి ఏ చుట్టం వచ్చినా.. ఈ బోడ కాకరకాయతో వంటలు చేసి పెడతారు. అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు. Adilabad News: ఆదిలాబాద్‌లో బోడ కాకరకి భలే డిమాండ్, దీంతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు

చాలా పోషకాలు
ఇంతకీ ఈ బోడ కాకర గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనిని అడవి కాకర.. లేదా ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ కూరగాయలో ఎన్నో పోషకాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సీజనల్ గా దొరికే కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి. కేవలం ఆషాడం, శ్రావణ మాసాల్లోనే దొరికే వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను బలపరుస్తుంది. బోడకాకరను పోషకాల గని అనొచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో ఉంటాయి. 


Adilabad News: ఆదిలాబాద్‌లో బోడ కాకరకి భలే డిమాండ్, దీంతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు

శరీరం ఫిట్ గా ఉండటానికి కావాల్సినవి అన్నీ ఈ కూరగాయలో ఉన్నాయి. బోడ కాకర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. బోడ కాకర కాయలు తింటే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బోడ కాకర కాయలు తినడం వల్ల ఇది రక్తంలోని చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మంచిదని చెప్తున్నారు. ఫైటో న్యూట్రిషన్ కలిగిన బోడ కాకరకాయ శరీరంనుండి నీరసాన్ని తగ్గిస్తుంది. 

ఇది రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. బోడ కాకర కాయలలో ఫైబర్ ఉంటుంది. ఇది అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. బోడ కాకర కాయలు యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. అంతేకాదు బోడ కాకరకాయలను గర్భిణీ స్త్రీలు కూడా కూర చేసుకొని తినడం వల్ల గర్భస్థ శిశువు కూడా బాగా ఎదుగుతుందని చెబుతారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న బోడ కాకరకాయను ఈ సీజన్లో తినడం అసలు మర్చిపోవద్దు. చికెన్, మటన్ కంటే ఇది గొప్ప పోషకాలతో ఉన్న కూరగాయ కాబట్టి ఈ సిజన్ తప్పా మళ్ళీ దొరకవు.


Adilabad News: ఆదిలాబాద్‌లో బోడ కాకరకి భలే డిమాండ్, దీంతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, ఎవరికీ అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget