Complaint Against Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ డ్యాన్స్‌పై ఫిర్యాదు- తీసేయాలంటున్న కరాటే కల్యాణి!
Complaint Against Devi Sri Prasad: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై నట కరాటే కళ్యాణి సైబక్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడి పాటను ఐటం సాంగ్ లో చిత్రీకరించారని ఆరోపించారు.
Complaint Against Devi Sri Prasad: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటి కరాటే కల్యాణితోపాటు పలు హిందు సంఘాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఓ పిల్లా అనే ప్రైవేటు ఆల్బమ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన "హరే రామ హరే కృష" మంత్రం పై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని అన్నారు. లేని పక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నటి కరాటే కల్యాణి హెచ్చరించారు.
స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ నటించిన ఆల్బమ్ ఇది. ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో అక్టోబర్ లో విడుదల అయింది. తెలుగులో "ఓ పిల్లా" పేరుతో వచ్చింది.
మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పై భారతీయ జనతా పార్టీ కూడా ఆగ్రహంగా ఉంది. ఆయన రూపొందించిన ఓ పాట కర్ణ కఠోరంగా ఉందని తక్షణం ఆ పాటను అన్ని చోట్లా డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. పాట అంత బాగోలేకపోతే వినకుండా ఉంటే సరిపోతుంది కానీ అన్ని చోట్లా తీసేయమని డిమాండ్ చేయడం ఏమిటని అనిపించవచ్చు. అయితే కర్ణ కఠోరంగా ఆ పాట ఉండటానికి కారణం దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కాదు. లిరిక్స్. అందులో బీజేపీ చాలా పవిత్రంగా భావించే దేవుడి పాటను పేరడిచేసి అసభ్యంగా పెట్టారట. అందుకే ఆ పాటను డిలీట్ చేయాలంటున్నారు. కోట్లాదిమంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించారనేది ప్రధాన ఆరోపణ. బీజేపీ జాతీయ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్థసారధి ఈ డిమాండ్‌ను వినిపించారు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించిన @ThisIsDSP బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆ పాటను అన్ని ప్రసార (1/3) pic.twitter.com/GO3gzGEUqC
— Dr Parthasarathi / डॉ पार्थसारथी / డా పార్థసారథి (@drparthabjp) November 2, 2022
ఈ పాట సినిమాలోనిది కాదు. దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా ఈ పాటలో డాన్స్ చేశారు. ఇటీవలి కాలంలో దేవిశ్రీ ప్రసాద్ జాతీయ స్థాయిలో పాటలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ యూ ట్యూబ్ చానల్ అయిన టీ సిరీస్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాట రూపొందించారు. నాలుగు వారాల కిందట యూట్యూబ్లోఅప్ లోడ్ చేశారు. ఈ పాటలకు ఇరవై మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. హిందీలో ఉన్న సాంగ్‌లో ... అభ్యంతరకర పదాలున్నాయనేది బీజేపీ అభ్యంతరం.