అన్వేషించండి

ACB notices to KTR: సోమవారం పొద్దున్నే రండి - కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం పది గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

ACB issues notice to KTR once again : ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇంతకు ముందుఓ సారి నోటీసులు జారీ చేసినా.. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రాలేనని.. వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆ మేరకు ఏసీబీ అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఓ సారి ఈడీ ఎదుట కూడా హాజరయ్యారు. ఓ సారి ఏసీబీ విచారణకు వెళ్లినా లాయర్ ను అనుమతించలేదని మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు.  అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. చాలా కాలం తర్వాత గత నెలలో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై అప్పట్లో కేటీఆర్  కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు.  చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానననిప్రకటించారు.  చాలా ముందుగానే  పార్టీ కార్యక్రమాల కోసం  UK & USAకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. తాను  తిరిగి వచ్చిన తర్వాత వారి ముందు హాజరవుతాను. ACB అధికారులకు అదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాననని ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పుడు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కానీ అనుకున్న ఫలితంరాలేదు.  ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అప్పట్లో ఏసీబీ విచారణకు  కేటీఆర్  హాజరయ్యారు.  'అసలు ఫార్ములా ఈ రేస్ ఎందుకు తీసుకురావాలనుకున్నారు.?, ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.?, HMDA నిధులు ఎలా బదిలీ చేశారు.?, అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా చెల్లింపులు చేశారు.?, HMDA నుంచి ఈ కార్ రేసింగ్‌కు రూ.55 కోట్లు ట్రాన్స్‌ఫర్ ఎలా జరిగింది.?, ఐటీకి HMDA రూ.8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది.?, 10 సీజన్స్ నిర్వహించాలని వారు షరతులు విధించారా.?, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల పాత్ర ఏంటి.?' వంటి  వాటిపై గత విచారణలో అడిగినట్లుగా చెబుతున్నారు. 

ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ నిర్వహించే  కంపెనీకి  హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి యాభై కోట్ల ను చెల్లించారు. అయితే అలాంటి చెల్లింపుల కోసం కనీసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారానే చెల్లించేశారు. తర్వాత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యాభై కోట్ల గోల్ మాల్ పై చర్యలు ప్రారంభించారు. అయితే తన ఆదేశంతోనే చెల్లించామని కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కోసం..  హైదరాబాద్ కోసమే చెల్లించామని అంటున్నారు. ఇందులో అవినీతికి అవకాశమే లేదని చెబుతున్నారు.              

టాప్ హెడ్ లైన్స్

Telangana Analog Paneer Ban: తెలంగాణలో నకిలీ పన్నీర్ బంద్ - ఏడాది పాటు అనలాగ్ పన్నీర్‌పై నిషేధం విధిస్తూ గెజిట్ విడుదల!
తెలంగాణలో నకిలీ పన్నీర్ బంద్ - ఏడాది పాటు అనలాగ్ పన్నీర్‌పై నిషేధం విధిస్తూ గెజిట్ విడుదల!
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
Prabhas : ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Chandrababu Warning: రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
BJP MLAs Tractor Rally: అసెంబ్లీకి ట్రాక్టర్లపై వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు - రైతుల సమస్యల పరిష్కారం కోసమే!
అసెంబ్లీకి ట్రాక్టర్లపై వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు - రైతుల సమస్యల పరిష్కారం కోసమే!
Vaddera Quarry: వడ్డెరలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. క్వారీపూల్‌గా 100 హెక్టార్ల ప్రభుత్వ భూములు కేటాయింపు
వడ్డెరలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. క్వారీపూల్‌గా 100 హెక్టార్ల ప్రభుత్వ భూములు కేటాయింపు
Embed widget