అన్వేషించండి

KTPS: పాల్వంచ కేటీపీఎస్‌లో 8 కూలింగ్ టవర్ల కూల్చివేత - 3 దశల్లో ప్రక్రియ సాగిందిలా!

Telangana News: కొత్తగూడెం పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్ఎం కర్మాగారంలో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చేశారు. 3 దశల్లో కూల్చివేత ప్రక్రియను చేపట్టారు.

Cooling Towers Dismatled In Palwancha KTPS: విద్యుత్ కర్మాగారంలో కాలం చెల్లిన కూలింగ్ టవర్స్‌ను అధికారులు కూల్చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్ఎం కర్మాగారంలో 8 టవర్ల ప్రస్థానం ముగియగా వాటిని అధునాతన టెక్నాలజీ సాయంతో నేలమట్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తొలి విద్యుత్ వెలుగులు అందించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) లో కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు భావించారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న ఈ కర్మాగారం మూతపడింది. దీంతో 2023, జనవరి 18 నుంచి కర్మాగారానికి సంబంధించి టవర్ కూల్చివేత పనులు మొదలయ్యాయి. 

3 దశల్లో ప్రక్రియ

టవర్ల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి, అందులోని మెటీరియల్ తీసుకునే విధంగా హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీ రూ.465 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ట్రాన్స్ కో, జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాత టవర్లను కూల్చేశారు. దాదాపు 30 మంది సిబ్బంది సుమారు నెల రోజులు ఈ కూల్చివేత సన్నాహాలు చేశారు. 3 దశల్లో ఈ ప్రక్రియ సాగింది. తొలుత 'ఎ' స్టేషన్‌లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన 4 కూలింగ్ టవర్లను కూల్చివేయగా.. అనంతరం 115 మీటర్ల ఎత్తుగల 4 టవర్లను 2 దశల్లో నేలమట్టం చేశారు. ఇంప్లోషిన్ అనే పేలుడు పదార్థాన్ని కూల్చివేత కోసం వినియోగించారు. టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేసిన అనంతరం కేటీపీఎస్‌కు ఉపయోగపడనుంది. 1965 - 67 నుంచి 78 వరకూ దశలవారీగా నిర్మించిన ఏ, బీ, సీ పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం ఈ కూలింగ్ టవర్స్ నిర్మించారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో 2 గంటలపాటు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు.

Also Read: Mulugu News: సీపీఆర్ చేసి ఊపిరి పోసిన కానిస్టేబుల్స్ - బలమైన గాయం ప్రాణం తీసింది

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget