IPS Transfers: తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌ల బదిలీ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్
Telangana IPS Transfers: తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల కిందట భారీగా ఐఏఎస్, కలెక్టర్లను బదిలీ చేసింది. సోమవారం నాడు ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Telangana CS Shanti Kumari | హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల కిందట భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. పలు జిల్లాల ఎస్పీలు సహా ఏకంగా 28 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు సోమవారం (జూన్ 17) రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు, సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్, జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకీ ధరావత్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సుబ్బారాయుడును డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, శంషాబాద్ డీసీపీగా బీ రాజేష్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డి, హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్, జనగామ వెస్ట్‌జోన్ డీసీపీగా జీ రాజమహేంద్ర నాయక్, డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని, రైల్వేస్ ఎస్పీగా చందనా దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, వికారాబాద్ ఎస్పీగా కె. నారాయణరెడ్డి, నల్గొండ ఎస్పీగా శరద్ చంద్రపవార్ లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
Before You Go
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
ట్రెండింగ్ వార్తలు























