Waterfalls in Telangana: తెలంగాణలో టాప్ 10 Waterfalls, ఈ వర్షాకాలంలో తప్పకుండా వెళ్లి ఆస్వాదించండి
Waterfalls in Telangana: తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో తప్పకుండా వెళ్లి ఆస్వాదించాల్సిన జాబితా ఇక్కడ ఉంది.

Waterfalls in Telangana: జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణలోని రాష్ట్రాలను తప్పకుండా సందర్శించాల్సిందే. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో అంతెత్తు నుంచి జాలువారే జలపాతాలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే, మంత్ర ముగ్దులను చేసే అద్భుతమైన జలపాతాలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. ఆ అద్భుతమైన జలపాతాల గురించి ఇప్పుడు తెలుసుకందాం.
1. కుంటాల జలపాతం
కష్ట్రంలోడెం నదిపై ఉంటుంది కుంటాలా జలపాతం. రాని ఎత్తైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ గ్రామ సమీపంలో ఉంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి మధ్యలో ఈ జలపాతం ఉంటుంది. కుంటాల జలపాతం హైదరాబాద్ నుంచి 261 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో, నేరేడిగొండ గ్రామం, మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
2. పొచ్చెర జలపాతం
పొచ్చెర జలపాతం రాష్ట్రంలోని లోతైన జలపాతాల్లొ ఒకటి. నిర్మల్ పట్టణ కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఉండే ఈ జలపాతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పర్యాటకులను మంత్రముగ్దులను చేసే ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. పొచ్చెర జలపాతాన్ని ప్లంజ్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఆదిలాబాద్ కు కేవలం 47 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
3. గాయత్రి జలపాతం
గోదావరికి ఉపనది అయిన కడెం నదిపైనే ఉంటుంది ఈ గాయత్రి జలపాతం కూడా. ఇది నిర్మల్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన వృక్షసంపద కారణంగా, తర్నామ్ ఖుర్ద్ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల మేర నడిచి గాయత్రి జలపాతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. 100 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది.
4. కనకై జలపాతాలు
కలకై జలపాతాన్ని కనకదుర్గ జలపాతం అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంటుంది. బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం కాలి నడక ఈ జలపాతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 జలపాతాలు ఉంటాయి. 30 అడుగుల జలపాతం విశాలమైన కొలనులో పడుతుంది. ఈ ప్రాంతమంత దట్టమైన అటవీప్రాంతం.
5. బొగత జలపాతం
ములుగు జిల్లాలో ఉంటుంది బొగత జలపాతం. దీనిని తెలంగాణ నయాగరా అని కూడా అంటారు. అద్భుతమైన ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది. తెలంగాణలో కుంటాల జలపాతం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన జలపాతం బొగత జలపాతం. ములుగు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
6. భీముని పాదం జలపాతం
మహబూబాబాద్ జిల్లాలోని అద్భుతమైన జలపాతం భీముని పాదం జలపాతం. సీతానగరం గ్రామానికి సమీపంలో ఉంటుంది ఈ జలపాతం. దట్టమైన అడవి గుండా ఈ జలపాతానికి చేరుకోవాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గూడూరు నుంచి 10 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
7. మల్లెల తీర్థం జలపాతం
నల్లమల అడవిలోని ప్రసిద్ధ్ జలపాతాల్లో మల్లెల తీర్థం జలపాతం ఒకటి. 150 అడుగుల పైనుంచి నీరు జాలువారుతుంటే చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చని ప్రకృతి మధ్య మనోహరంగా విహరించవచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం 173 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. శ్రీశైలం నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
8. సహస్త్రకుండ్ జలపాతం
సహస్త్రకుండ్ జలపాతం నిర్మల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెనుగంగ నదిపై ఉండే అద్భుతమైన జలపాతం ఇది. 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది. ఆదిలాబాద్ నుంచి 116 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 282 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
9. ముత్యాల జలపాతం
ముత్యాల జలపాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. తెలంగాణలోని అద్భుతమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి జలపాతం మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఉంటుంది.
10. బుగ్గ జలపాతం
బుగ్గ జలపాతం హైదరాబాద్ నుంచి కేవలం 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని అడవిలో అద్భుతమైన ఈ పరిసరాలు మనోహరంగా ఉంటాయి. నల్గొండ నుంచి కేవలం 2.5 గంటల దూరంలో ఉంటుంది. దీనికి సమయంలోనే బుగ్గ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంటుంది.





















