YouTube New Feature: వార్నీ.. ఈ ఫీచర్ భలే ఉందిగా.. మీరు కూడా జరిపేయండి..
యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. స్లైడ్ టు సీక్ (slide to seek) అనే ఈ ఫీచరును త్వరలో యాడ్ చేయాలని భావిస్తోంది. ఈ పీచర్ ద్వారా వీడియోలను ఫార్వర్డ్, రివైండ్ వంటివి ఈజీగా చేయొచ్చు.
మనం యూట్యూబ్‌లో ఒక వీడియోను సీరియస్‌గా చూస్తుంటాం. తర్వాత ఏం జరుగుతుందో చూడాలనే ఆత్రంలో స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తాం. దీంతో వీడియో పది సెకన్లు ముందుకి జరుగుతుంది. అది పొరపాటున ప్రెస్ అయితే మనం చూసే వీడియో కాస్తా పోయి.. దాని తర్వాతి వీడియో వచ్చేస్తుంది. మీలో చాలా మందికి కూడా ఇది అనుభవం అయ్యే ఉంటుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టేలా యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. స్లైడ్ టు సీక్ (slide to seek) అనే ఈ ఫీచరును త్వరలో యాడ్ చేయాలని యూట్యూబ్ భావిస్తోంది. ఈ పీచర్ ద్వారా వీడియోలను ఫార్వడ్, రివైండ్ వంటివి ఈజీగా చేయొచ్చు. మనం సాధారణంగా యూట్యూబ్‌లో ఉపయోగించే డబుల్ ట్యాప్ ఫీచరుతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది.
Also Read: Pegasus Spyware: ఐమాజింగ్.. ఐఫోన్లలో పెగాసస్ జాడ కనిపెట్టే యాప్.. ఎలా పని చేస్తుందో తెలుసుకోండి
ఇది ఎలా పనిచేస్తుందంటే..
మనం వీడియోలను చూసేటప్పుడు స్క్రీన్ మీద ఒక గీత కనిపిస్తుంది. దానిపై డాట్ లాంటి ఒక సింబల్‌ను యూజర్లు చూడవచ్చు. దీనిని జరిపేందుకు 'స్లైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ టు సీక్' (Slide left or right to seek) అనే మెసేజ్ కనిపిస్తుంది. దీనిని జరుపుతూ వీడియోను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. అయితే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉంది. ఇది విజయవంతమైతే త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఈ ఫీచర్ యూట్యూబ్ యాప్ వెర్షన్ 16.31.34 వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి వీడియోలు చేస్తే డబ్బులే డబ్బులు..
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తే.. వ్యూస్ ఆధారంగా ఛానల్‌కు డబ్బులు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా యూట్యూబ్ షార్ట్స్ కూడా కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్ యాప్‌నకు పోటీగా యూట్యూబ్ సైతం షార్ట్ వీడియో ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి షార్ట్స్ (Shorts) అనే పేరు పెట్టింది. ఇందులో షార్ట్ వీడియోలు క్రియేట్ చేసేవారికి డబ్బులు చెల్లించాలని తాజాగా నిర్ణయించింది. దీని కోసం 100 మిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేసింది.
Read More: YouTube Shorts: ఇలాంటి వీడియోలు చేస్తే యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు.. కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్