Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది.

భారత ఆర్థిక అభివృద్ధికి YouTube చేయూత
ప్రముఖ ఆన్ లైన వీడియో ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ భారత జీడీపీ-2021కి ఎంతో తోడ్పాటును అందించింది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కలిపి ఏకంగా రూ.10 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చింది. ఏకంగా 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎకనామిక్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ లో 4,500 పైగా యూట్యూబ్ ఛానెల్స్ కు 10 లక్షలకు పైగా సబ్ స్ర్కైబర్స్ ఉన్నట్లు తెలిపింది. ఏడాదికి రూ.లక్షకు పైగా ఆదాయం సాధిస్తున్న ఛానెల్స్ సంఖ్య 2021లో ఏకంగా 60 శాతం పెరిగినట్లు వివరించింది.
ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి
YouTube ఆదాయం, ఉద్యోగ కల్పన, ప్రభావం మీద ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 4 వేలకు పైగా యూట్యూబ్ వినియోగదారులు, 5 వేలకు పైగా యూట్యూబ్ క్రియేటర్లు, 5 వందలకు పైగా వ్యాపార సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇద్దరు యూట్యూబ్ యూజర్లలో ఒకరు తమ కెరీర్ కు యూజ్ ఫుల్ గా ఉండే టెక్నిక్స్ తెలుసుకునేందుకు యూట్యూబ్ ఉపయోగిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలను పొందాలి అనుకునే వారిలో 45 శాతం మంది వారికి అవసరమైన నైపుణ్యాన్ని యూట్యూబ్ ద్వారా పొందే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యారంగంలో ముఖ్యపాత్ర
“యూట్యూబ్ ను విద్యారంగంలో గతంతో పోల్చితే ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణ విద్యాభ్యాసానికి అదనంగా యూట్యూబ్ ను విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా పిల్లలు చాలా ఈజీగా, సరదాగా నేర్చుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడించారు. విద్యార్థులు చక్కటి అవగాహన పెంచుకునేందుకు యూట్యూబ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు, అధ్యాపకులు వెల్లడించారు” అని నివేదిక తెలిపింది.
ఆదాయ వనరుగా మార్చుకున్న మహిళలు
గతంతో పోల్చితే మహిళలు సైతం యూట్యూబ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆక్స్ ఫర్డ్ నివేదిక వెల్లడించింది. పర్సనల్ ఫైనాన్స్ సహా స్ఫూర్తినిచ్చే సలహాలు పొందేందుకు యూట్యూబ్ ను వినియోగిస్తున్నారు. తమ ఇష్టాఇష్టాలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు, కెరీయర్, వ్యాపారాలను నిర్మించుకునేందుకు వాడుకుంటున్నారు. తమ జీవితానికి తోడ్పడే ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు మహిళలు యూట్యూబ్ ను సాధనంగా మార్చుకున్నారు. ఎన్నో విషయాలను నిత్యం తెలుసుకునేందుకు యూట్యూబ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని 77 శాతం మహిళలు చెప్పారు. అటు రోజు వారీ నైపుణ్యాల కోసం సహాయకరంగా ఉందని 56 శాంత మహిళలు వివరించారు. తమ ఆసక్తినికి, ఆలోచనలను పంచుకునేందుకు ఉపయోగపడుతుందని 90 శాతం మహిళలు వివరించారు.
వరల్డ్ వైడ్ గా ఇండియన్ కంటెంట్ కు డిమాండ్
ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అధ్యయనం ప్రకారం.. భారత యూట్యూబ్ క్రియేటర్స్ ద్వారా రూపొందిన కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నట్లు తేలింది. పలు భాషల్లో రూపొందుతున్న కంటెంట్ వినియోగదారులకు ఉపయోగపడటంతో పాటు క్రియేటర్స్ కు భారీగా ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడైంది. అటు కంటెంట్ క్రియేటర్స్ కు మరింత మేలు కలిగేలా మానిటైజేషన్ ప్రక్రియను తీసుకురానున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
Read Also: మీరు విమానాశ్రయాల దగ్గర నివసిస్తున్నారా? ఇప్పట్లో 5Gని పొందలేరు, ఎందుకో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

