అన్వేషించండి

WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?

Telegram Ban In India | నీట్ రీఎగ్జామ్ పూర్తయ్యే వరకు టెలిగ్రామ్ యాప్ మీద నిషేధం విధించారు. అయితే టెలిగ్రామ్ దాని అధిక వేగం, పెద్ద గ్రూపులు, ఫైల్ షేరింగ్ సామర్థ్యంలో భారీ సంఖ్యలో వాడుతున్నారు.

Telegram Ban in India: భారత్ సహా పలు దేశాలలో మెసేజింగ్ యాప్‌ల వాడకం పెరిగింది. నేడు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, కొలీగ్స్‌తో ఛాటింగ్ నుండి ఎడ్యేకేషన్, వ్యాపారం, పెద్ద పెద్ద కమ్యూనిటీల వరకు ఇప్పుడు మొబైల్ యాప్‌లపైనే ఆధారపడుతున్నాం. కానీ మంగళవారం నాడు భారత ప్రభుత్వం నీట్ పరీక్షకు సంబంధించి టెలిగ్రామ్ (Telegram App) పై కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే అందరికీ వస్తున్న డౌట్ వాట్సాప్ (WhatsApp) లాంటి మెస్సేజింగ్ యాప్‌నకు బదులుగా టెలిగ్రామ్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ. దీని వెనుక టెలిగ్రామ్ పనిచేసే విధానం, దాని ప్రత్యేక ఫీచర్లు కారణంగా మారాయి. 

టెలిగ్రామ్ గురించి ప్రశ్నలు ఎందుకు తలెత్తాయి?
టెలిగ్రామ్ యాప్ దాని వేగం, పెద్ద గ్రూపులు, ఫైల్ షేరింగ్ సామర్థ్యంతో యూజర్లను ఆకట్టుకుంది. వాట్సాప్‌లో గ్రూపులు, ఛానెల్‌లకు కొన్ని లిమిట్స్ ఉండగా, టెలిగ్రామ్‌లో ఒకేసారి లక్షలాది మందికి ఏదైనా సమాచారాన్ని షేర్ చేయవచ్చు. ఇదే కారణంతో చాలాసార్లు కొందరు వ్యక్తులు టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ను తప్పుడు పనులకు కూడా ఉపయోగిస్తున్న సందర్భాలు ఉన్నాయి.  పెద్ద పబ్లిక్ ఛానెల్‌లు, అన్‌లిమిటెడ్ ఫైల్ షేరింగ్ వంటి ఫీచర్ల కారణంగా చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా సెన్సిటివ్ కంటెంట్ సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి కేసులలో అధికారులు మొదట ఫోకస్ చేసింది టెలిగ్రామ్‌పైనే. 

Also Read: MiOffice AI: డేటా సెక్యూరిటీతో 150కిపైగా డిజిటల్‌ టూల్స్ ఒకే చోట! వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చిన MiOffice AI

టెలిగ్రామ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
టెలిగ్రామ్ ఒక క్లౌడ్ బేస్డ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. అంటే మీ మెసేజ్‌లు, మీడియా ఫైళ్లు కేవలం ఫోన్‌లోనే కాకుండా టెలిగ్రామ్ సర్వర్లలో కూడా సేఫ్‌గా ఉంటాయి. ఇందువల్లే మీరు ఏ కొత్త డివైజ్‌లోనైనా లాగిన్ అయినా పాత చాట్స్‌ని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.

వాట్సాప్ అయితే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అయితే టెలిగ్రామ్‌ యాప్‌లో నార్మల్ చాట్స్ క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. టెలిగ్రామ్ సీక్రెట్ చాట్ (Secret Chat) పేరుతో స్పెషల్ ఫీచర్ అందిస్తుంది. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. మెసేజ్‌లకు ఎక్కువ భద్రత లభిస్తుంది.

వాట్సాప్, టెలిగ్రామ్ మధ్య ప్రధాన వ్యత్యాసం
వాట్సాప్ ఎక్కువగా వ్యక్తిగత సంభాషణలకు వాడతారు. అయితే టెలిగ్రామ్ పెద్ద కమ్యూనిటీలు, పబ్లిక్ ఛానెల్‌లతో ఫేమస్ అయింది. లిగ్రామ్‌లో ఒక ఛానెల్ ద్వారా లక్షలాది మందికి మెసేజ్ పంపవచ్చు. పెద్ద ఫైళ్లను షేర్ చేయడం, ఆటోమేటెడ్ బాట్స్ (Bots) ఉపయోగించడం టెలిగ్రామ్ కు ప్లస్ పాయింట్. ఈ కారణంగానే టెలిగ్రామ్ యాప్‌ను చదువు, బిజినెస్, కంటెంట్ షేరింగ్ కోసం ప్రత్యేకంగా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవే ఫీచర్లను కొందరు దుర్వినియోగం చేసే అవకాశాన్ని కూడా పెంచుతాయి.

టెలిగ్రామ్ పూర్తిగా సేఫ్ కాదా..
అలా అని చెప్పడం కరెక్ట్ కాదు. టెలిగ్రామ్ యాప్ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, పాస్‌కోడ్ లాక్ (Passcode Lock),  సీక్రెట్ చాట్ వంటి పలు సేఫ్టీ ఫీచర్లను ఇస్తుంది. సేఫ్టీ ఉన్న కారణంగానే  చాలా వరకు వినియోగదారులు యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకేసారి ఛానల్స్ లేదా గ్రూపులతో కనెక్ట్ అయి దాని వినియోగించే వ్యక్తులపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది.

Frequently Asked Questions

భారత ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఎందుకు నిషేధించింది?

నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని భావించి భారత ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. మెసేజింగ్ యాప్‌ల వాడకం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?

టెలిగ్రామ్ పెద్ద గ్రూపులు, అన్‌లిమిటెడ్ ఫైల్ షేరింగ్, లక్షలాది మందికి సమాచారం పంపే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఫీచర్లు కొన్నిసార్లు తప్పుడు పనులకు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది.

టెలిగ్రామ్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? వాట్సాప్‌తో దీనికి తేడా ఏమిటి?

టెలిగ్రామ్ క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్. మీ మెసేజ్‌లు సర్వర్‌లలో నిల్వ చేయబడతాయి. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై ఆధారపడితే, టెలిగ్రామ్ 'సీక్రెట్ చాట్'లో మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది.

టెలిగ్రామ్ యాప్ సురక్షితమేనా?

టెలిగ్రామ్ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, పాస్‌కోడ్ లాక్, సీక్రెట్ చాట్ వంటి భద్రతా ఫీచర్లను అందిస్తుంది. అయితే, దాని భద్రత వినియోగదారులు ఛానెల్‌లు లేదా గ్రూపులతో ఎలా కనెక్ట్ అవుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget