అన్వేషించండి

MiOffice AI: డేటా సెక్యూరిటీతో 150కిపైగా డిజిటల్‌ టూల్స్ ఒకే చోట! వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చిన MiOffice AI

MiOffice AI: ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న MiOffice AI మరో అద్భుతం చేసింది. డేటా భద్రతకు భరోసానిస్తూ, బ్రౌజర్‌లోనే ఫైల్ ప్రాసెసింగ్‌ చేసే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MiOffice AI డిజిటల్ టూల్స్‌తో డేటా భద్రత కల్పిస్తుంది.
  • WASM టెక్నాలజీతో డేటా బ్రౌజర్‌లోనే సురక్షితంగా ప్రాసెస్ చేస్తుంది.
  • బ్యాచ్ ప్రాసెసింగ్, AI స్టూడియో, మల్టీమీడియా సేవలను ఉచితంగా అందిస్తుంది.

MiOffice AI: డిజిటల్‌ యుగంలో పనులు ఎంత ఈజీగా అవుతున్నాయో ప్రమాదం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా డేటా చోరీ అందర్నీ హడలెత్తిస్తోంది. అందుకే ఆన్‌లైన్ టూల్స్ వాడుకోవాలంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తోంది. దీనికి తెలుగు ప్రతిభ సంస్థ పరిష్కారం చూపింది. ఎంతో విలువైన టూల్స్‌ అన్నీ ఒకే చోట అందించిన ఈ సంస్థకు చెందిన MiOffice AI మరో వండర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్‌తో మీ ముందుకు వచ్చింది. 

ఇంతకీ ఏంటీ MiOffice AI ?

MiOffice AI అనేది మీ ప్రొడక్టివిటీని రెట్టింపు చేసే 150కిపైగా డిజిటల్ టూల్స్ ఉచితంగా అందించే ప్లాట్‌ఫామ్. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తలు, టెక్కీస్‌ ఇలా అందర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాట్‌ఫామ్ అనేక టూల్స్‌ను అందిస్తోంది. ఒకే చోటా మీ పనులు పూర్తి అయ్యేలా చేస్తుంది. ఎక్కువ వెబ్‌సైట్లపై ఆధారపడకుండా ఉండేలా చేస్తుంది. 

డేటా ప్రైవసీ స్పెషలిస్ట్‌ MiOffice AI    

ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇంత ఫేమస్ చేసింది వారు వాడే వెబ్‌అసెంబ్లీ(WASM) టెక్నాలజీ. వేరే వెబ్‌సైట్‌లో మీరు ఫొటోను రీసైజ్ చేయాలంటే, మీరు ఫొటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత చాలా ప్రాసెస్ జరుగుతుంది. మీ ఫొటోలను వారి సర్వర్‌లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పని పూర్తి చేస్తుంది. 

కానీMiOffice AIలో ఉండే టూల్స్ చాలా ప్రత్యేకం. నేరుగా మీ కంప్యూటర్, మొబైల్ బ్రౌజర్‌లోనే కావాల్సిన పనిని పూర్తి చేస్తాయి. అంటే మీ డేటా వారి సర్వర్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. దీని వల్ల మీ వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉంటుంది. 

ఎంత పని అయిన బ్యాచ్‌ ప్రాసెసింగ్‌తో సింపుల్ 

మీరు ఒకేసారి 50కిపైగా ఫైళ్లను ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ MiOffice AI యూజ్‌ఫుల్ అవుతుంది. దీని కోసం Batch Processing అనే టూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఫొటోల క్వాలిటీ పెంచాలన్నా, వీడియో నుంచి ఆడియోను వేరు చేయాలన్నా ఇక్కడ మీకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు రసీదులు, గుర్తింపు కారులను స్కాన్ చేయాల్సి వస్తే MiOffice AIలో లభించే టూల్స్ ద్వారానే మొబైల్ కెమెరాను స్కానర్‌గా మార్చుకోవచ్చు.  

అందుబాటులోకి వచ్చిన ఏఐ స్టూడియోతో అద్భుతాలు

MiOffice AIలోని ఏఐ స్టూడియో ద్వారా కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. పెద్ద పెద్ద డాక్యుమెంట్లను సమరైజేషన్ చేయవచ్చు, కంటెంట్‌ క్రియేషన్ కూడా ఇక్కడ చాలా సులువుగా ఉంటుంది. పీడీఎఫ్‌లను మెర్జ్ చేయాలన్నా, సపరేట్ చేయాలన్నా, వర్డ్‌ ఫార్మాట్‌లోకి మార్చడం వంటివి ఒకట్రెండు క్లిక్‌లతోనే పూర్తి అవుతాయి. దీనికి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు. కంప్యూటర్, మొబైల్ వాడటం వస్తే చాలు. 

మల్టీమీడియా సదుపాయాలు

ఇమేజ్ ప్రాసెసింగ్‌ విభాగంలో ఏఐ ఆధారిత బ్యాక్‌గ్రౌండ్‌ రిమూవర్‌, ఫొటో ఆప్టిమైజేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీడియోలను ట్రిమ్ చేయం, GIFలుగా మార్చడం వంటి మల్టీమీడియా పనులు కూడా ఇక్కడ చేయడం చాలా ఈజీ. మొబైల్ ఫోన్ ద్వారా పత్రాలను నేరుగా పీడీఎఫ్‌లుగా మార్చుకునే డాక్యుమెంట్‌ స్కానింగ్ సదుపాయం మరో ఆకర్షణ. 

ఉచితంగానే 150 టూల్స్ 

ప్రస్తుతం MiOffice AI లోని 150 టూల్స్ కూడా పూర్తి ఉచితంగా పొందవచ్చు. చాలా సేవల కోసం కనీసం మీరు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. వేగం, సౌలభ్యం, సెక్యూరిటీతో కలిపి సేవలు అందిస్తున్న MiOffice AI నిజంగా మంచి ప్లాట్‌ఫామ్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.  

Frequently Asked Questions

MiOffice AI అంటే ఏమిటి?

MiOffice AI అనేది మీ ఉత్పాదకతను రెట్టింపు చేసే 150కిపైగా డిజిటల్ టూల్స్ అందించే ప్లాట్‌ఫామ్. ఇది సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరి అవసరాలను తీర్చడానికి అనేక టూల్స్‌ను ఒకే చోట అందిస్తుంది.

MiOffice AI డేటా భద్రతను ఎలా నిర్ధారిస్తుంది?

MiOffice AI వెబ్‌అసెంబ్లీ (WASM) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని ద్వారా మీ డేటా వారి సర్వర్‌లోకి వెళ్ళకుండా, నేరుగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లోనే పనులు పూర్తి చేస్తుంది, మీ వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుంది.

MiOffice AIలోని టూల్స్ ఉచితంగా లభిస్తాయా?

అవును, ప్రస్తుతం MiOffice AI లోని 150 టూల్స్ కూడా పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. చాలా సేవలను ఉపయోగించడానికి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు.

MiOffice AIలోని AI స్టూడియోతో ఎలాంటి పనులు చేయవచ్చు?

MiOffice AIలోని AI స్టూడియో పెద్ద డాక్యుమెంట్‌లను సంగ్రహించడం, కంటెంట్ క్రియేషన్, PDFలను విలీనం చేయడం లేదా విభజించడం వంటి కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. దీనికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు.

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget