Whatsapp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ - ఒకే యాప్‌లో ఎన్ని అకౌంట్లు అయినా?
ప్రస్తుతం వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్‌పై పని చేస్తుంది.
WhatsApp Multi Account Feature: వాట్సాప్ ప్రస్తుతం మల్టీపుల్ అకౌంట్ లాగిన్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ కింద మీరు ఒకే యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగించగలరు. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు వెళ్లడానికి మీరు స్విచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రకమైన ఫీచర్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందించింది.
మల్టీపుల్ అకౌంట్ లాగిన్ ఫీచర్ పరిచయంతో మీరు ఫోన్‌లో ప్యారలల్ స్పేస్, డ్యూయల్ యాప్స్ వంటి యాప్స్‌ను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను పరిశీలించే వెబ్‌సైట్ Wabetainfo షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొన్ని బీటా టెస్టర్ల కోసం విడుదల చేశారు. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. మీరు కూడా ముందుగా వాట్సాప్‌కు సంబంధించిన అన్ని కొత్త ఫీచర్లను పొందాలనుకుంటే, దీని కోసం మీరు కంపెనీ బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవాలి.
కొత్త అకౌంట్‌ను యాడ్ చేయడానికి మీరు సెట్టింగ్స్‌కు వెళ్లి క్యూఆర్ కోడ్ బటన్ పక్కన ఉన్న యారో సింబల్‌పై నొక్కాలి. అక్కడ నుంచి మీరు అకౌంట్‌ను యాడ్ చేయగలరు. అకౌంట్‌ను యాడ్ చేసిన తర్వాత మీరు దాని నుంచి లాగ్ అవుట్ అయ్యే వరకు ఆ అకౌంట్ కూడా మీ డివైస్‌లో లాగిన్ అయి ఉంటుంది. అంటే మీరు ఖాతాలను స్విచ్ చేసినప్పుడు మళ్లీ మళ్లీ లాగిన్ చేయవలసిన అవసరం ఉండదు.
ఉపయోగం ఏంటి?
ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు వారి వ్యక్తిగత ఛాట్‌లు, వర్క్ ఛాట్‌లు, ఇతర ఛాట్‌లను ఒకే యాప్‌లో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కొత్త ఫీచర్ నోటిఫికేషన్లతో పాటు మీ ఛాటింగ్‌లను వేరుగా ఉంచుతుంది. దీని కారణంగా మీరు వివిధ డివైసెస్ లేదా ప్యారలల్ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉపయోగిస్తున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ఇది కాకుండా ప్రస్తుతం వాట్సాప్ డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. కాలక్రమేణా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడం కంపెనీ లక్ష్యం. త్వరలో కంపెనీ యూజర్‌నేమ్ ఫీచర్‌ని కూడా రోల్‌అవుట్ చేయగలదు. ఇది నంబర్ షేరింగ్‌ను ఎలిమినేట్ చేస్తుంది. దీని కారణంగా నంబర్ లేకుండా వాట్సాప్‌లో ఛాట్ చేసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం ఒకే గూగుల్ అకౌంట్‌తో డివైస్‌లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి సహాయపడే ఒక ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ పని చేస్తోంది. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహమాన్ కూడా ఎక్స్‌లో (ట్విట్టర్) ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. గూగుల్ త్వరలో "కాల్ స్విచింగ్" వంటి ఫీచర్లను ప్రారంభించవచ్చని తెలిపారు.
Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial