WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.. డెలిట్ అయిన మెసేజ్ లను రికవరీ చేసుకునేలా వెసులుబాటు కల్పించబోతుంది. ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది..
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందుంటుంది వాట్సాప్. తాజాగా మరో అదిరిపోయే అప్ డేట్ ను అందుబాటులోకి తీసురాబోతుంది. ఇప్పటికే టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫీచర్ ద్వారా.. యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్‌లను రికవరీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్ లో ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఎవరికైనా పంపించిన మెసేజ్ పొరపాటున డిలీట్ అయితే.. ఆ మెసేజ్ ను రికవరీ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం డెలిట్ అయిన మెసేజ్ లను రికవరీ చేసుకునే అవకాశం లేదు.
మెసేజ్ రికవరీ ఎలా అంటే.?
త్వరలో అందుబాటులోకి రాబోయే వాట్సాప్ ఫీచర్ లో అనుకోకుండా మెసేజ్ డిలీట్ కాగానే వినియోగదారులకు అన్ డూ బటన్ కనిపిస్తుంది. మళ్లీ కావాలి అనుకుంటే వెంటనే దాన్ని ప్రెస్ చేయాలి. కొద్ది సెకెన్లలో డిలీట్ అయిన మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది. ఇతరులకు కనిపించకుండా డెలిట్ ఎవ్రీవన్ ప్రెస్ చేసినా.. మళ్లీ వెనక్కి తసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షలు జరుపుకుంటుంది. అయితే.. ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం లేటెస్ట్ బీటా అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఫీచర్ కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా మందికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. మరికొద్ది రోజుల్లో ఈ లేటెస్ట్ ఫీచర్ ను మరింత మంది బీటా యూజర్లకు వినియోగంలోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
టెస్టింగ్ దశలో మరో ఫీచర్
డెలిట్ అయిన మెసేజ్ లను రికవరీ చేసే ఫీచర్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ మీద టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. అదేంటంటే.. వాట్సాప్ వినియోగదారులు ఫోన్ నెంబర్ తెలియని యూజర్ల నుంచి హైడ్ చేసుకునే వెసులు బాటు కల్పించబోతుంది. ఇందుకోసం ఇప్పటికే టెస్ట్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ ను విడుదల చేసింది. బీటా టెస్టర్‌లు మాత్రమే ఈ ఫీచర్ ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
ఆండ్రాయిడ్ వెర్షన్ మీదే పరీక్షలు
ఈ లేటెస్ట్ ఫీచర్ కు సంబంధించి ఆండ్రాయిడ్ లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుంది. ఐవోఎస్ బీటా టెస్టర్లకు మాత్రం ఇప్పుడే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆండ్రాయిడ్ లో సక్సెస్ అయిన తర్వాత ఐవోఎస్ బీటా యూజర్లు ఈ ఫీచర్ ను పొందే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఐవోఎస్ మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ వెర్షన్ లో కూడా టెస్టింగ్ సక్సెస్ కానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో ఈ కొత్త ఫీచర్లను జనాల ముందుకు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో వాట్సాప్ వినియోగదారులు ఈ ఫీచర్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.